మహిళలకు దీపావళి కానుక.. మిల్లెట్ కేఫ్‌లు,, వారికి మరో బంపర్ బొనాంజా!
తెలంగాణా ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త ఉపాధి మార్గం చూపిస్తూ మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తొలి విడతలో ఐదు మిల్లెట్ కేఫ్‌లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లు, మహిళలకు డ్రోన్లు వంటి పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు మిల్లెట్ కేఫ్‌ల ద్వారా మరో ముందడుగు వేస్తోంది. తొలి దశలో హైదరాబాద్‌లో మూడు కేఫ్‌లు, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కేఫ్‌లు ఏర్పాటు కానున్నాయి.

హైదరాబాద్‌లో బీఆర్కే భవన్, మాదాపూర్ ఇందిరా మహిళా శక్తి బజార్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రాంగణంలో ఈ కేఫ్‌లు వస్తున్నాయి.ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున మొత్తం రూ.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిర్మాణ పనులు చాలా చోట్ల పూర్తి దశకు చేరుకున్నాయి. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే 40 మంది మహిళలకు శిక్షణ అందించారు.
ఆహార తయారీ, నిర్వహణ, వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కేఫ్‌లలో రాగి జావ, రాగి సంకటి, మిల్లెట్ ఉప్మా, కిచిడీ, మిల్లెట్ కేకులు, బిస్కెట్లు, రొట్టెలు, మురుకులు, పులిహోర వంటి ఆరోగ్యకరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయి.ఈ కేఫ్‌ల ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుంది.
జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం. పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. మహిళా అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుందని అన్నారు. చిరుధాన్యాలను యువతలోకి తీసుకెళ్లి పోషకాహార భద్రతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 19న ఈ కేఫ్‌లు అధికారికంగా ప్రారంభం కాగా, మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.












Click it and Unblock the Notifications
