H3N2 Influenza A Virus: వణికిస్తున్న H3N2 వైరస్.. ఇప్పటికే ఇద్దరు మృతి..

దేశంలో హెచ్3ఎన్2 వైరస్‍తో ఇద్దరు మృతి చెందారు.

దేశంలో హెచ్3ఎన్2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, హర్యానాలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. "హాంకాంగ్ ఫ్లూ" అని కూడా పిలువబడే ఇన్ఫ్లుఎంజా కేసులు భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 90 H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి, H1N1 వైరస్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇన్ఫ్లుఎంజా సోకిన వారికి జ్వరం, చలి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, గురక వంటి లక్షణాలు ఉంటాయి. వికారం, గొంతు నొప్పి, విరేచనాలు కూడా అవుతాయట.

ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్, శ్వాసకోశ సమస్యకు కారణమవుతుంది. ఈ వైరస్ పక్షుల నుంచి కూడా సోకుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, H3N2 అనేది ఇన్ఫ్లుఎంజా A వైరస్ ఉప రకం. ఇన్ఫ్లుఎంజా అంటు వ్యాధి. ఇది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకి నోరు లేదా ముక్కును తాకినట్లయితే వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అంతర్లీన వైద్య సమస్యలతో బాధపడుతున్న ఈ వైరస్ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు.

H3N2 Influenza A Virus Are Spreading in Country

పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో ఆక్సిజన్ స్థాయిని నిరంతరం చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ సంతృప్త స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉంటే, డాక్టర్ ను సంప్రదించాలి.

సరైన విశ్రాంతి తీసుకోవడం, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగడం, జ్వరాన్ని తగ్గించడానికి ఎసిటమైనోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ పెయిన్‌కిల్లర్‌లను ఉపయోగించడం చేయాలి. రోగికి తీవ్రమైన లక్షణాలు ఉంటే లేదా సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే, డాక్టర్ సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+