Haunted railway stations: ఆత్మ ఏడుపులు, అరుపులు.. బరోగ్ రైల్వేస్టేషన్ భయానక కథ ఇదే!
మనకు తెలియని అనేక మిస్టరీలు మన సమాజంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. నిజంగా దెయ్యాలు ఉన్నాయా? లేవు అని హేతువాదులు అంటే, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుందని వీటిని బలంగా నమ్మే వాళ్ళు చెబుతారు. ఇప్పుడు అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే చర్చ పక్కన పెడితే దేశంలో దెయ్యాల పేరుతో అనేక రైల్వే స్టేషన్ల పైన భయానకమైన ముద్రపడింది.
బరోగ్ రైల్వేస్టేషన్ లో ఆత్మ అరుపులు, ఏడుపులు
అటువంటి రైల్వేస్టేషన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా చెప్పుకోవలసిన రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న బరోగ్ రైల్వే స్టేషన్. చుట్టూ ప్రకృతి అందాలతో ఉండే ఈ రైల్వే స్టేషన్ ఒక భయానకమైన స్టోరీ కలిగి ఉంది. ఈ రైల్వేస్టేషన్లో ఆత్మ తిరుగుతుందని, ఈ రైల్వే స్టేషన్ పరిసరాలలోని టన్నెల్ లో చాలామంది దెయ్యాన్ని చూశారని, అరుపులు, కేకలు, ఏడుపులు విన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

రైల్వేస్టేషన్ సమీపంలో టన్నెల్ నిర్మించిన ఇంజనీర్ ఆత్మ
ఆ ఆత్మ ఆ టన్నెల్ నిర్మించిన వ్యక్తి ఆత్మ అని కూడా స్థానికంగా చెప్పుకున్నారు. ఇక ఆ కథ వివరాలలోకి వెళితే బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ బరోగ్ బరోగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని టన్నెల్ ను నిర్మించారు. కల్క సిమ్లా రైల్వే లైన్ కోసం అప్పట్లో బ్రిటిషర్స్ ఈ సొరంగాన్ని నిర్మించే పనిని కల్నల్ బరోగ్ కు అప్పగించారు. సొరంగం యొక్క రెండు చివరలను సరిగ్గా రూపొందించడంలో అతను విఫలమయ్యాడు.
టన్నెల్ నిర్మించి ఆత్మహత్య చేసుకున్న కల్నల్ బరోగ్
దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అతనిని మందలించడంతో పాటు జరిమానా విధించింది. దీంతో అవమానానికి గురైన కల్నల్ బరోగ్ ఈ సొరంగంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికీ అతని ఆత్మ సొరంగంలోనే తిరుగుతోందని చెబుతారు. ఏడుపులు అరుపులు వినిపిస్తాయని టన్నెల్ నెంబర్ 33 దగ్గరకు రాగానే అక్కడి జనాలు భయపడతారని కూడా చెబుతారు. ఇప్పటికీ సాయంత్రం కాగానే ఇక్కడ కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతాయని వారు అంటున్నారు.
సాయంత్రం అయితే నిర్మానుష్యంగా రైల్వేస్టేషన్
అందుకే సాధారణంగా ఈ రైల్వేస్టేషన్లో సాయంత్రం కాగానే జనసంచారం పూర్తిగా తగ్గిపోతుంది. రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా తయారవుతుంది. ఈ ప్రాంత వాసులు అందరూ ఈ రైల్వే స్టేషన్ కు సాయంత్రం దాటిన తర్వాత వెళ్లాలంటే వణికి పోతారు. కల్నల్ బరోగ్ ఆత్మ తిరిగే రైల్వే స్టేషన్ గా దేశంలోనే హంటెడ్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.












Click it and Unblock the Notifications