ప్రాణం మీదికొచ్చిన నూడుల్స్ చట్నీ .. వెంటిలేటర్‌పై చిన్నారి .. కారణమిదే ...
న్యూఢిల్లీ : చిరు తిండ్లంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పప్స్, బర్గర్, గప్‌చిప్స్, నూడుల్స్ అంటే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అలా తినడమే ఓ చిన్నారి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. వీధుల్లో విక్రయించే చిరు పదార్థాల్లో టేస్ట్ కోసం వారు కలిపే ఐటెమ్స్ వినియోగదారుల పాలిట శాఫంగా మారుతున్నాయి. స్నాక్స్ తిందామని ఉపక్రమిస్తే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది.

నూడుల్సే కదా ..?
హర్యానాకు చెందిన మజూర్ తన కుమారుడు ఉస్మాన్‌కు గారాబం చేశాడు. అడిగిందల్లా కొనిచ్చేవాడు .. ఇక చిరుతిండ్ల సంగతి సరేసరి. దీంతో తమ ఇంటి పక్కన ఉండే నూడుల్స్ లాగించేవాడు ఉస్మాన్. అందులో వేసే చట్నీని మనోడు జుర్రేవాడు. దాదాపు 17 రోజుల క్రితం తన తండ్రి నూడుల్స్ తినిపించాడు. ఎప్పటిలాగే తిన్నాడు. కానీ చట్నీ వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాడో తేలీదు గానీ .. మొత్తం తినేశాడు. తర్వాత ఇంటికి చేరుకొన్నారు. కానీ ఆ రాత్రి ఉస్మాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. తెల్లవారి ఉస్మాన్ శరీరం నీలం రంగులోకి మారిపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందారు.

క్రిటికల్ కండీషన్ ..
బీపీ కూడా పడిపోయి .. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పిల్లాడి ఊపిరితిత్తులు పాడయ్యాయని గుర్తించారు. వెంటనే అతడికి వెంటిలేటర్‌పై వైద్యం చేశారు. దాదాపు 16 రోజులపాటు ఐసీయూలో ఉంచితే కానీ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడలేదు. వెంటిలేటర్‌పై ఉంచి .. క్షణ క్షణం గమనిస్తూ వైద్యం అందించడంతో ఎట్టకేలకు బాగైంది.

ఎందుకిలా ?
ఉస్మాన్ ఆరోగ్యం ఎందుకిలా సడెన్‌గా పాడైందని వైద్యులను అడిగితే విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి. నూడుల్స్ కోసం తయారుచేసే చట్నీలో ఎసిటిక్ యాసిడ్ వాడారని తెలిపారు. సాధారణంగా వీధుల్లో లభించే పదార్థాలకు మరింత రుచి రావటానికి కొందరు ఎసిటిక్ ఆమ్లం వాడతారు. అలా హోటల్ యాజమాని వాడంతో .. పిల్లవాడి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అందులో పిల్లవాడు ఎక్కువ చట్నీ తీసుకోవడంతో శరీరంలో చేరి .. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications