• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: చలికాలంలో అనారోగ్య సమస్యల దాడి; కాపాడుకోవటానికి ఈ టిప్స్ పాటించండి!!

|
Google Oneindia TeluguNews

శీతాకాలంలో మనం అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. శీతాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు, విపరీతమైన నొప్పులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మారుతున్న వాతావరణం ఒక్కసారిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఎటువంటి చిట్కాలను మన ఆరోగ్యం కోసం పాటించాలి అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శీతాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త

శీతాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త


శీతాకాలంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెబుతారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మనం పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తృణ ధాన్యాలు, మాంసం, చేపలు, చిక్కుడు గింజలు, తాజా కూరగాయలు, తాజా పండ్లతో పాటు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు.

శీతాకాలంలో వ్యాయామం , యోగా ఆపకండి

శీతాకాలంలో వ్యాయామం , యోగా ఆపకండి


ప్రస్తుత కాలంలో ఫిట్ గా, ఆరోగ్యంగా చలికాలంలో శరీరంలో కలిగే నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు. కచ్చితంగా రోజువారీ దినచర్య గా యోగా చేయడం గాని, లేదా శారీరక శ్రమ చేయడం కానీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక శీతకాలంలో మన శరీరానికి విటమిన్ డి అవసరం ఉంటుంది కాబట్టి, బయట సూర్యరశ్మిని ఆస్వాదించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇక ఇవి ఈ సీజన్లో వచ్చే ఫ్లూ నుండి, ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి బయట పడేస్తాయని చెబుతున్నారు.

శీతాకాలంలో చర్మ సమస్యలు .. జాగ్రత్త

శీతాకాలంలో చర్మ సమస్యలు .. జాగ్రత్త


ఇక శీతాకాలంలో చర్మ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం, దురదలు రావడం చోటు చేసుకుంటుంది. ఇక పెదవులు పండుతాయి. కాలి మడమలు కూడా పగుళ్ళు రావడం జరుగుతుంది. అందుకే శీతాకాలంలో చర్మాన్ని తప్పనిసరిగా సంరక్షించుకోవాలి. దీనికోసం మాయిశ్చరైజింగ్ క్రీములను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నూనె రాసుకున్నా చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక చర్మం పొడిబారకుండా నీటిని అధికంగా

తీసుకోవాలని సూచిస్తున్నారు.

తీసుకోవాలని సూచిస్తున్నారు.

శీతాకాలంలో ఎక్కువ నీరు త్రాగటం, మంచి నిద్ర పోవటం అవసరం
ప్రతిరోజు కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలని, శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచాలని సలహా ఇస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయని, నీరు శరీరానికి పోషకాలను అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి నిద్ర పోవడం చాలా అవసరమని చెబుతున్నారు. శీతాకాలంలో మంచి నిద్ర శరీర రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అని, ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇక శీతాకాలంలో పరిశుభ్రత పాటించాలని, బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాప్తి చెందకుండా శుభ్రంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

helath tips: కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా? అయితే తినాల్సినవి.. తినకూడనివి ఇవే; తెలుసుకోండి!!

English summary
It is said that health problems attack during winters, and to prevent it, it is necessary to eat a balanced diet, drink more water, exercise and protect the skin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X