weather update: తెలంగాణలో మరో 3 రోజులపాటు భారీ వర్షాలు, తమిళనాడులోనూ

న్యూఢిల్లీ: తెలంగాణతోపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. తమిళనాడులోని ఇరోడ్, కోయంబత్తూరు, కృష్ణగిరి, తిరుపత్తూరు, వెల్లూరు, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తమిళనాడు డెల్టా జిల్లాల్లో కోస్తా ప్రాంతం పుదుచ్చేరి, కరైకల్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తమిళనాడులో కొత్తగా 1568 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 19 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 26.19 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1657 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 25,68,161కి చేరింది. కోయంబత్తూరులో కొత్తగా 239 కేసులు, చెన్నైలో 162 కరోనా కేసులు నమోదయయాయి.

Recommended Video

    Weather Update : Five Days Continuous Heavy Rains In Telangana | Oneindia Telugu
    heavy rainfall in parts of Telangana and Tamil Nadu today.

    కడలూరు, నమ్మక్కల్, అరియలూరు జిల్లాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాలయాలను తెరిచిన మూడు రోజుల తర్వాత ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు కరోనావైరస్ బారినపడ్డారు. కరోనా వ్యాక్సిన్ కేటాయింపులతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు తమిళనాడు వైద్యారోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు. 11 మెడికల్ కాలేజీలతోపాటు మదురై దగ్గర ఎయిమ్స్ ఏర్పాటు విషయంపై కేంద్రమంత్రితో చర్చించారు.

    మరో మూడు రోజులపాటు వర్షాలు

    తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం శనివారం ఈశాన్య & పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొలదీ దాక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది.

    ఈ ఆవర్తన ప్రభావంతో ఉత్తర, పరిసర మధ్య బంగళాఖాతంలో రాగల 48 గంటలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర మట్టంకి 2.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుంది.

    షియర్ జోన్ 12° ఉత్తర లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టానికి 5.8 కి మీ నుండి 7.6 కి మీ మధ్య కొనసాగుతుంది. శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

    శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం, ఆదివారం భారీ వర్షాలు ఒకటి,రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నవి. రాగల 3 రోజులు ఉరుములు , మెరుపులుతో కూడిన వర్షములు చాలా ప్రదేశములో వచ్చే అవకాశములు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. గండిపేట గేట్లు ఎత్తివేసి ముూసిలోకి నీటిని వదిలారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+