వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణానిధి సంతకం వెనకున్న కథేంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంజ్ఞర్ కరుణానిధి ఏది చేసిన అందులో తన మార్క్ ఉంటుంది. ఒక సినిమాకు కథ రాసినా... ఒక పద్యం రాసినా... ఒక మాట మాట్లాడినా... ఒక రాజకీయం చేసినా.. ఇలా ఏది చేసినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతారు. ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కరుణానిధి..తమిళం భాష అన్నా... తమిళ జాతి అన్నా ఎంతో ఇష్టపడేవాడు. తనకు తెలుగు అర్థమైనప్పటికీ ఎప్పుడూ తెలుగులో మాట్లాడేవాడు కాదు... అంతలా తమిళంను ఆయన సొంతం చేసుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే కరుణానిధి విషయంలో మాత్రం ఇది కనిపించదు. తమిళం తప్ప పరభాష మాట్లాడేందుకు కరుణానిధి పెద్దగా ఆసక్తి చూపరు.

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

ఇక కరుణానిధి సంతకం ఎవరైనా గమనిస్తే అందులో ఎవ్వరికీ అర్థం కాని విషయం ఒకటి దాగుంది. పేరుకు సంతకమే అయినా... అందులో తన గతజీవితం కనిపిస్తుందని చెప్తారు కలైంజ్ఞర్. తను ఏ జాతికోసమైతే ఉద్యమించానో అది తన సంతకంలో కనిపిస్తుందని చెబుతారు. ఆ సంతకంలో ఓ సందేశం కూడా ఉంది.ఇంతకీ ఆసంతకంలో ఏముందనేగా మీ డౌటు... ఇదే డౌటు కరుణానిధి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా వచ్చింది.

సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం

Hidden secret in Karunanidhi signature

తను ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్న గోపాలపురం నివాసాన్ని తదనంతరం అన్నైఅన్జుగం ట్రస్ట్‌కు రాసిస్తూ సంతకం చేశారు కలైంజ్ఞర్. అయితే అదే సమయంలో ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఇంతకీ ఆ సంతకంలో ఏముంది తలైవా అని అడిగారట. అందుకు సమాధానంగా కరుణానిధి... ఈ సంతంకంలో నా గత జీవితం కనిపిస్తుందని చెప్పారట. పారిశ్రామికవేత్త మహాలింగం, ఇతర పార్టీ ప్రతినిధులకు ఆ సంతకం గురించి కరుణానిధి వివరంగా చెప్పారట.

తన సంతకంలో ద్రవిడనాడు కనిపిస్తుందని చెప్పగానే ముందుగా వీరికి అర్థం కాలేదు. ఆ తరువాత స్వయంగా కరుణానిధే ఇలా వివరించారట. తన సంతకంలో కనిపించే ఇంగ్లీషు అక్షరం 'v'లా కనిపించేది భారతదేశ మ్యాప్‌పై కనిపించే దక్షిణ భాగం అని చెప్పారట. తన సంతకం కింద ఉన్న చుక్క శ్రీలంకను చూపిస్తుందని చెప్పారట. అంతేకాదు ఈ సంతకం గురించి మరో రహస్యం కరుణానిధి చెప్పారు. తను ఈ సంతకం నేర్చుకునేందుకు ఆరునెలలు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారట. ఎప్పుడూ ప్రజాజీవితంలో ఉండే మీరు ఒక్క సంతకం నేర్చుకునేందుకు ఆరునెలల సమయం ఎలా కుదిరిందని అడగ్గానే... తాను కొన్ని దశాబ్దాల క్రితం తిరుచ్చి జైలులో ఉన్నప్పుడు ఈ సంతకం ఆరునెలల పాటు ప్రాక్టీస్ చేశానని అసలు సంగతి బయట పెట్టాడట కరుణానిధి.

English summary
DMK president M Karunanidhi’s peculiar signature, indeed, has a message, and he revealed it while signing the gift deed donating his Gopalapuram residence to the Annai Anjugam Trust.Pointing to the ‘V’ shaped curve in his signature Karunanidhi explained that it resembled the southern part of India on the map and the dot resembles Srilanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X