గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరు, ఢిల్లీ నిర్ణయం, బాంబు పేల్చిన మాజీ సీఎం, బళ్లారి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్టీలో లేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైకమాండ్ అనుమతి ఇవ్వాలని యడ్యూరప్ప చెప్పారు.

బళ్లారిలో గాలి !

బళ్లారిలో గాలి !

బీజేపీ చేపట్టిన కర్ణాటక పరివర్తనా యాత్ర సందర్బంగా బళ్లారి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంలో బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ ప్రధాన్యత ఇస్తుందా ? అని మీడియా ప్రశ్నించింది.

ఆయన లేరు

ఆయన లేరు

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని బీఎస్. యడ్యూరప్ప గుర్తు చేశారు. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి లేరని, ఆయన పార్టీకి చెందిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

హైకమాండ్ నిర్ణయం

హైకమాండ్ నిర్ణయం

బీజేపీ గాలి జనార్దన్ రెడ్డి కొనసాగడమా ? లేక దూరంగా పెట్టడమా అనే విషయం హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయం తాను తీసుకోలేనని బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యలతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు, అభిమానులు అయోమయానికి గురైనారు.

 నాకు తెలీదు

నాకు తెలీదు

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలీదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు. ఆయన బీజేపీని వదిలిపెడుతున్నారనే సమాచారం తన దగ్గర లేదని బీఎస్. యడ్యూరప్ప చెప్పారు.

జైలుకు వెళ్లిన గాలి

జైలుకు వెళ్లిన గాలి

అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015లో సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యక్రమాలకు, బళ్లారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు ఆదేశం

బళ్లారిలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గాలి జనార్దన్ రెడ్డి అక్కడి రాజకీయాలకు దూరంగా ఉంటూ బెంగళూరులో నివాసం ఉన్నారు. ఇటీవల గదగ్ లో బళ్లారి ఎంపీ శ్రీరాములు నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి హాజరైనారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Party high command will take a final decision on Former minister Janardhana Reddy political re-entry, Now he is not active in the party said Karnataka BJP president B.S. Yeddyurappa in Ballari.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి