ఆ 'వ్యాలెట్ 'లో భారీగా నగదు, పోన్ చేసి వ్యాలెట్ ను ఇచ్చిన పోలీస్
ఢిల్లీలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేసే మదన్ సింగ్ పనిచేస్తున్నాడు. రోడ్డుపై జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి తన పర్స్ ను పోగొట్టుకొన్నాడు. ఆ పర్స్ ను ఆయనకు తిరిగి ఇచ్చాడు.
న్యూఢిల్లీ :రోడ్డుపై ఒక్క రూపాయి కన్పించినా ముందు వెనుక ఆలోచించకుండా తీసుకొంటాం,. కాని, ఢిల్లీలో ఓ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ అధికారి నగదు, ఎటిఎం కార్డులున్నా పర్సును తిరిగి యజమానికి అప్పగించి అందరిచేత ప్రశంసలు పొందాడు. తన పర్సును తిరిగి ఇచ్చినందుకు సంతోషంగా ఇచ్చే బహుమానాన్ని కూడ తీసుకోకుండా తన డ్యూటీ చేశానంటూ ఆ అధికారి తన నిజాయితీని నిరూపించుకొన్నాడు. ఈ విషయాన్ని వ్యాపారి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. నిజాయితీ గల పోలీసు అధికారి అంటూ నెటిజన్లు మదన్ సింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
న్యూఢిల్లీలో మదన్ సింగ్ ట్రాపిక్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆయన వయస్సు 54 ఏళ్ళు.నాలుగు రోజుల క్రితం మదన్ సింగ్ ఉదయం జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి కారులో వెళ్తున్నాడు. మార్గమద్యలో ఆయన కారు మొరాయించింది. మదన్ సింగ్ విధులు చేసే ప్రాంతంలోనే ఈ కారు మొరాయించింది.అయితే కారును తోసుకొంటూ వెళ్ళాడు జగ్రీత్ సింగ్.
జగ్రీత్ సింగ్ కారును తోసుకొంటూ వెళ్ళే సమయంలో ఆయన జేబులో నుండి పర్సు పడిపోయింది. ఆ పర్సులో 35 వేల నగదు, 300 అమెరికన్ డాలర్లు ఉన్నాయి. వీటితో పాటు ఎటిఎం కార్డులు కూడ ఉన్నాయి. అయితే రోడ్డుపై పడిన ఈ పర్స్ ను ఓ సైకిస్టు తీసుకొంటోంటే మదన్ సింగ్ చూశాడు.

సైకిలిస్టుకు చెందిన పర్స్ కాదని నిర్ఱాధించుకొని అతని వద్ద నుండి పర్స్ ను తీసుకొన్నాడు మదన్ సింగ్. మరో వైపు పర్స్ లో ఉన్న విజిటింగ్ కార్డుల ఆదారంగా ఫోన్ చేశాడు మదన్ సింగ్.
అయితే తన పర్స్ లోని డబ్బులు ఉండవని వ్యాపారి జగ్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు.అయితే మదన్ సింగ్ వద్దకు వచ్చిన జగ్రీత్ సింగ్ ఆశ్చర్యపోయాడు.తన పర్స్ లో నగదు , ఎటిఎం కార్డులన్నీ కూడ అలానే ఉన్నాయి.
దీంతో సంతోషం పట్టలేక జగ్రీత్ సింగ్ పోలీస్ అధికారి మదన్ సింగ్ కు ఐదువేల రూపాయాలను బహుమానంగా ఇచ్చేందుకు ప్రయత్నించాడు.అయితే ఈ నగదును తీసుకొనేందుకు మాత్రం మదన్ సింగ్ ఇష్టపడలేదు. తన డ్యూటీని తాను చేశానని ఆయన చెప్పారు.
ఈ మేరకు ఆయన జగ్రీత్ సింగ్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్టుచేశాడు,నిజాయితీ గల పోలీసు అధికారి మదన్ సింగ్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఈ ఘటనతో మదన్ సింగ్ కుటుంబసభ్యులు కూడ హార్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications