వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు ? మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై విచారణలో సుప్రీం ధర్మాసనం ప్రశ్న

|
Google Oneindia TeluguNews

విద్య, ఉద్యోగాలలో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ ప్రశ్నను సంధించింది . రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తలెత్తే అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది.

మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దు "తీవ్రమైన అంశం" .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన సుప్రీం

మహారాష్ట్ర మరాఠా కోటా రిజర్వేషన్లపై మండల్ తీర్పును పునః పరిశీలించాలని పిటీషన్

మహారాష్ట్ర మరాఠా కోటా రిజర్వేషన్లపై మండల్ తీర్పును పునః పరిశీలించాలని పిటీషన్

రిజర్వేషన్లపై పరిమితి విధించిన మండల్ తీర్పును మారిన పరిస్థితుల నేపథ్యంలో పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై మహారాష్ట్ర తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయమూర్తి ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషనర్ తరఫున వాదనలు విన్నది.

న్యాయమూర్తి ముకుల్ రోహత్గి మారిన పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్ కోటాలను పరిష్కరించడానికి కోర్టులు దానిని రాష్ట్రాలకు వదిలివేయాలని, 1931 జనాభా లెక్కల ప్రకారం మండల్ తీర్పును ప్రతిపాదించారు.

రిజర్వేషన్లపై మీ వైఖరేంటి ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు ? ప్రశ్నించిన ధర్మాసనం

రిజర్వేషన్లపై మీ వైఖరేంటి ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు ? ప్రశ్నించిన ధర్మాసనం

మరాఠాలకు కోటా మంజూరు చేసే మహారాష్ట్ర చట్టానికి అనుకూలంగా వాదించిన రోహత్గి, ఇంద్ర సాహ్నీ కేసు అని కూడా పిలువబడే మండల్ తీర్పులోని వివిధ అంశాలను ప్రస్తావించారు . ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి 10 శాతం కోటా మంజూరు చేయాలన్న కేంద్రం నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు .

మీరు సూచించినట్లుగా, 50 శాతం లేదా పరిమితి లేకపోతే, అప్పుడు సమానత్వం యొక్క భావన ఏమిటి ? అసమానత మాటేమిటి? చివరకు మేము ఈ అంశాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది .ఈ అంశంపై మీ వైఖరి ఏమిటి? ఎన్ని తరాల పాటు దీనిని కొనసాగిస్తారు ?అని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, ఎస్ అబ్దుల్ నజీర్, హేమంత్ గుప్తా మరియు ఎస్ రవీంద్ర భట్లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది.

 మండల్ తీర్పును తిరిగి సమీక్ష చెయ్యటం పై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

మండల్ తీర్పును తిరిగి సమీక్ష చెయ్యటం పై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

1931 జనాభా లెక్కల ప్రకారం ప్రతిపాదించబడిన మండల్ తీర్పును తిరిగి సమీక్ష చెయ్యటానికి చాలా కారణాలు ఉన్నాయని, అంతేకాకుండా, జనాభా చాలా రెట్లు పెరిగి 135 కోట్లకు చేరుకుందని రోహత్గి చెప్పారు.

అయితే ధర్మాసనం మాత్రం స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయాయని, రాష్ట్రాలు ఎంతో ప్రయోజనకరమైన పథకాలను కొనసాగిస్తున్నాయని, ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన కులాలు ఇంకా ముందడుగు వేయలేదని తాము ఎలా అంగీకరించాలో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇంకా వెనుకబాటు తనం ఉంది.. ఆకలి మరణాలున్నాయి .. వాదించిన ముకుల్ రోహత్గీ

ఇంకా వెనుకబాటు తనం ఉంది.. ఆకలి మరణాలున్నాయి .. వాదించిన ముకుల్ రోహత్గీ

మండల్ తీర్పును సమీక్షించే ఉద్దేశ్యం వెనుకబాటుతనం నుండి బయటకు వచ్చిన వారిని నిర్మూలించడమేనని కోర్టు అభిప్రాయపడింది.వాదనలు వినిపించిన రోహత్గి దేశ అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పటికీ పూర్తిగా వెనుకబాటుతనం నిర్మూలన కాలేదన్నారు. వెనుకబడిన వర్గాలు 50 నుండి 20 శాతానికి తగ్గాయి. ఈ దేశంలో మనకు ఇంకా ఆకలి మరణాలు ఉన్నాయి . ఇంద్ర సాహ్నీ మండల్ తీర్పును పూర్తిగా తప్పు అని చెప్పడానికి నేను ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు.

సోమవారానికి కేసు వాయిదా ... మరోమారు సోమవారం వాదనలు విననున్న సుప్రీం

సోమవారానికి కేసు వాయిదా ... మరోమారు సోమవారం వాదనలు విననున్న సుప్రీం

30 సంవత్సరాలు గడిచిపోయాయి అని, చట్టం మారిపోయింది, జనాభా పెరిగింది, వెనుకబడిన వ్యక్తులు కూడా పెరిగి ఉండవచ్చు "అని అందుకే మండల్ తీర్పును పునఃపరిశీలించాలని అవసరముందని రోహత్గి అన్నారు. రాజ్యాంగంలో చేసిన సవరణలను ఆయన ప్రస్తావించారు . దేశం దాని వెనుకబడిన తరగతులకు అవసరమైన విముక్తికి సమీపంలో చేరుకోలేదని సూచికలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సోమవారం రోజు కూడా ధర్మాసనం వాదనలు విననుంది .

English summary
For how many generations would reservations in jobs and education continue, the Supreme Court sought to know during the Maratha quota case hearing on Friday and raised concerns over "resultant inequality" in case the overall 50 per cent limit was to be removed.A five-judge Constitution bench headed by Justice Ashok Bhushan was vehemently told by senior advocate Mukul Rohatgi, appearing for Maharashtra, that the Mandal judgement on capping the quota needed a re-look in changed circumstances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X