వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది’: మంత్రిత్వ శాఖలను లెక్కలడిగిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు పదే పదే అస్త్రంగా చేసుకుంటున్న అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులందరినీ లెక్కలు చెప్పాలని అడిగారు. తాము అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఇంకా యువతకు ఉద్యోగాలు లభించడం లేదని విపక్ష నేతలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యువతకు ఉద్యోగాల కల్పనపై ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్
గాంధీ మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

 ఉద్యోగాల లెక్కలు తేలాలి..

ఉద్యోగాల లెక్కలు తేలాలి..

ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగామా? లేదా? అనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖల్లో కొత్తగా కల్పించిన ఉద్యోగాలపై లెక్కలను మంత్రులను అడుగుతున్నారట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల తెలిసింది.

కీలకంగా ఉద్యోగాల కల్పన అంశం..

కీలకంగా ఉద్యోగాల కల్పన అంశం..

మే 26 నాటికి ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే బీజేపీ ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రూపంలో మరో సవాల్‌ ఉంది. ఈ నేపథ్యంలో 2014నాటి ఉద్యోగాల కల్పన హామీ కీలకంగా మారే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాని మోడీ ఆ విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ కల్పనపై ఇప్పటికే అన్ని మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నివేదికలు ఇవ్వండి..

నివేదికలు ఇవ్వండి..

ఆయా మంత్రిత్వశాఖలు ఈ నాలుగేళ్లలో ఏయే ప్రాజెక్టులు చేపట్టాయో, ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించాయో సవివరంగా నివేదికలు అందించాలని మోడీ ఆదేశించినట్లు తెలిసింది. అంతేగాక వృద్ధిరేటు పెంపునకు దోహదపడే విధంగా మంత్రిత్వశాఖలు ఏయే కార్యక్రమాలు చేపట్టాయో కూడా మోడీ తెలుసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం ఇంతవరకూ స్పందించలేదు.

నిరుద్యోగ రేటు తగ్గింది

నిరుద్యోగ రేటు తగ్గింది

కాగా, ఇటీవల ముంబైకి చెందిన ఓ బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో భారత్‌లో నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.86శాతానికి తగ్గిందని తేలింది. అంతకుముందు మార్చిలో ఇది 6.23శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పుడు ప్రధాని లెక్క తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా మంత్రులు ఇచ్చే నివేదికలు ఆసక్తికరంగా మారాయి.

English summary
Prime Minister Narendra Modi has asked his team to crunch numbers and figure out how many jobs were created in the four years of his rule -- a key factor watched by the nation headed for elections in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X