వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం.. 8 నియోజకవర్గాల్లో మనోళ్లే కీలకం.. కేజ్రీవాల్ కీలక హామీలు

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయినవాళ్లు కొందరైతే.. కేంద్ర ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ఫ్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాదివాళ్లదే అయినా.. 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాదిప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. పేరుకు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ఢిల్లీలో మాత్రం తెలుగువారంతా ఐక్యమత్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు.

5.5 శాతం మంది తెలుగువాళ్లు

5.5 శాతం మంది తెలుగువాళ్లు

ఢిల్లీలోని షాద్రా, మయూర్ విహార్, లజ్​పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్​పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్​ తదితర ఏరియాల్లో తెలుగువాళ్ల జనాభా ఎక్కువగా ఉంది. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం అక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగువాళ్లున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో తెలుగువాళ్లు దాదాపు 5.5 శాతం మంది ఉంటారు.

Recommended Video

Delhi Assembly Elections Opinion Poll : AAP to Win 54-60 out of 70 seats, BJP May Bag 10-14
మనోళ్ల ప్రభావం ఎక్కడంటే..

మనోళ్ల ప్రభావం ఎక్కడంటే..


ఓటర్ల సంఖ్య పరంగా తెలుగువాళ్లు తక్కువే అయినా.. అర్బన్ రాష్ట్రంగా పేరుపొందిన ఢిల్లీలో నేతల తలరాతలు మారడానికి ఆమాత్రం నంబర్ సరిపోతుంది. ఢిల్లీలో తెలంగాణ, ఏపీ భవన్ కొలువైఉన్న సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీచేస్తున్నారు. అలాగే ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీతోపాటు మొత్తం 8 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావముంది.

సుల్తాన్ పూర్ చాలా స్పెషల్..

సుల్తాన్ పూర్ చాలా స్పెషల్..

ఢిల్లీలోని సుల్తాన్ పుర్ బాద్షా అసెంబ్లీ నియోజకవర్గం తెలుగువాళ్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైంది. అక్కడ మనోళ్ల కోసం పెద్ద కాలనీయే ఉంది. అప్పటి కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి మళ్లీ ప్రధాని అయ్యాక.. తెలుగువారికి కానుకగా ఆ కాలనీలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం సుల్తాన్ పురి బాద్షాలో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో తెలగు ఓటర్లున్నారు.

తెలుగు అకాడమీ హామీ..

తెలుగు అకాడమీ హామీ..

ఢిల్లీలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ.. తెలంగాణ, ఏపీ నుంచి నేతలు, సెలబ్రిటీలను తీసుకెళ్లి ప్రచారం నిర్వహించడం ఎప్పుడూ జరిగేదే. గతంలో షీలా దీక్షిత్ తరఫున అప్పటి సీఎం వైఎస్సార్ ఢిల్లీలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటర్లను సంతోషపెట్టేలా అన్ని పార్టీలూ రకరకాల ప్రకటనలు చేస్తుంటాయి. ప్రస్తుత సీఎం కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

English summary
A total of 1.46 crore voters eligible to cast their vote in Delhi Assembly elections. about 8 lack telugu speaking voters can impact in eight constituencies including sultanpur badshah
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X