Human Sacrifice: సినిమా షూటింగ్ అని చెప్పి ఆంటీలను 60 ముక్కలు చేసి ?, షాకింగ్ ట్విస్టులు!
కొచ్చి/తిరువనంతపురం: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసులో సినిమా ట్విస్టులను తలతన్నే రీతిలో ఒక్కొక్క విషయం వెలుగు చూస్తోంది. మంత్రగాడి మాయలో పడిన వైద్యుడు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడని వెలుగు చూసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు, అతని భార్య, మాయాల మాంత్రికుడు అసలు మ్యాటర్ చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. మహిళలను హత్య చేసి వారి శవాలను 60 ముక్కలు చేశారని వెలుగు చూసింది.
పావురాలకు బియ్యం చల్లినట్లు ఇల్లు మొత్తం రక్తం, మహిళల శరీరంలోని ముక్కలు చల్లారని వెలుగు చూసింది. సినిమా షూటింగ్ అని చెప్పి ఇద్దరు మహిళలను నగ్నంగా మంచానికి కట్టేసి దారుణంగా చంపేశారని, వీళ్లు మనుషులేనా ? అనే రీతిలో డాక్టర్ దంపతులు, మంత్రగాడు ప్రవర్తించారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

ఆర్థిక సమస్యల దెబ్బతో డాక్టర్?
కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్ అలియాస్ డాక్టర్ భగవాల్ సింగ్ కు లైలా అనే మహిళతో వివాహం అయ్యింది. చాలా సంవత్సరాల నుంచి నానటు వైద్యుడు భగవాల్ సింగ్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

మంత్రగాడు ఏం చెప్పాడంటే?
నకిలి మాంత్రికుడు, మంత్రగాడు అని చెప్పుకుని తిరుగుతున్న మోహమ్మద్ షఫీ అనే వ్యక్తి గురించి తెలుసుకున్న భగవాల్ సింగ్ అతన్ని కలిశాడు. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని, తరువాత నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని మాంత్రికుడు మోహమ్మద్ షఫీ నాటు వైద్యుడు భగవాల్ సింగ్ కు చెప్పాడు.

డబ్బులు నేను ఇస్తాను పని పూర్తి చెయ్యి
డబ్బులు నేనే ఇస్తానని, మహిళలను నువ్వు పిలుచుకుని వచ్చి నరబలి ఇవ్వాలని భగవాల్ లాల్ నాటు వైద్యుడు మోహమ్మద్ షఫీకి చెప్పాడు. ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు అమ్ముతున్న పద్మా (52), రోసలిన్ (49) అనే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని మోహమ్మద్ షఫీ డిసైడ్ అయ్యాడు.

సినిమా షూటింగ్ అని చెప్పిన మంత్రగాడు
మంత్రగాడు మోహమ్మద్ షఫీ వేర్వేరుగా లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్న రోసలిన్, పద్మాలను కలిశాడు. సినిమాల్లో నటించడానికి మీకు చాన్స్ ఇప్పిస్తానని, మీరు నాతో వస్తే డబ్బులు కూడా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. రోసలిన్, పధ్మాలను నేరుగా నాటు వైద్యుడు భగవాల్ లాల్ ఇంటికి పిలుచుకుని వెళ్లారు.

నగ్నంగా మంచానికి కట్టేసి 60 ముక్కలు చేశారు
భగవాల్ లాల్ ఇంట్లో క్షద్రపూజలు చేసిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ పూజలో కుర్చున్న పధ్మా, రోసలిన్ కు ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతోందని, మిమ్మల్ని మంచానికి కట్టేసే సీన్లు తీస్తారని చెప్పారు. రోసలిన్, పధ్మాలను నగ్నంగా చేసి మంచానికి కట్టేసిన మంత్రగాడు మోహమ్మద్ షఫీ, నాటు వైద్యుడు భగవాల్ సింగ్, అతని భార్య లైలాలు కలిసి చంపేశారు.

మహిళల శవాలను 60 ముక్కలు చేసి ?
రోసలిన్, పధ్మాలను చంపేసిన ముగ్గురు ఇద్దరి శవాలను 60 ముక్కలు చేశారు. పావురాలకు బియ్యం చల్లినట్లు ఇల్లు మొత్తం రక్తం, మహిళల శరీరంలోని ముక్కలు చల్లారని వెలుగు చూసింది. తరువాత మహిళల శవాల ముక్కలు కొన్ని తీసుకెళ్లి భగవాల్ లాల్ ఇంటి వెనుక గొయ్యి తీసిపాతిపెట్టారు.

మిస్సింగ్ కేసులతో వెలుగులోకి జంట హత్యలు
రోసలిన్ కనపడటం లేదని ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆమె కూతురు, పధ్మా కనపడటం లేదని తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న ఆమె భర్త కేసులు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోసలిన్, పధ్మాల మొబైల్ ఫోన్ లకు చివరికిసారి ఎవరు ఫోన్ చేశారు అని ఆరా తీస్తే ఇద్దరికి మంత్రగాడు మోహమ్మద్ షఫీ ఫోన్ చేశాడని వెలుగు చూసింది. మంత్రగాడు మోహమ్మద్ షఫీని అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చిందని కేరళలోని పతనంతిట్ట పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications