వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా: సిర్సాలో గుట్టలుగా అస్థిపంజరాలు, రూ.200 కోట్ల నష్టం

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిర్సా: తాను చేసిన తప్పులను బయటకు రాకుండా డేరా సచ్ఛా సౌధాలో బాబా రామ్‌రహీమ్ సింగ్ అనేక దారుణాలకు పాల్పడ్డాడు. డేరా బాబా ఆశ్రమంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.

రా బాబా: అరెస్టు తర్వాత అల్లర్లకు రూ.5 కోట్లు, ఆ ఇద్దరే కీలకం?రా బాబా: అరెస్టు తర్వాత అల్లర్లకు రూ.5 కోట్లు, ఆ ఇద్దరే కీలకం?

తనకు వ్యతిరేకంగా వ్యవరిస్తారనే అనుమానం ఉన్న వారిని చంపేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. డేరా ఆవరణలో మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయని అధికారులు వివరించారు.

డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలుడేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు

రేపిస్టు గుర్మిత్ రామ్ రహీం సింగ్ కేంద్రమైన హర్యానా రాష్ట్రంలోని సిర్సా పట్టణంలో ఉన్న డేరా సచ్చా సౌదాలో సాయుధ పోలీసుల పహరా మధ్య తనిఖీలు జరిపిన అధికారుల బృందానికి దిమ్మతిరిగిపోయే వాస్తవాలు తెలిశాయి.

డేరా బాబా ఆశ్రమంలో అనేక ఘటనలు బయటకు రాకుండా చోటుచేసుకొన్నాయి. అయితే ఆయన అరెస్టు కావడంతో ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. అయితే డేరా ఆశ్రమంలో ఏం జరుగుతోందనే విషయాలపై రిటైర్ట్ జడ్జి ఏకేఎస్ పవార్ నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

డేరాబాబాను వ్యతిరేకిస్తే చావే

డేరాబాబాను వ్యతిరేకిస్తే చావే

డేరాలో సొదాలు నిర్వహించేందుకు వీలుగా మాజీ జిల్లా సెషన్స్ జడ్జీ ఏకేఎస్ పవార్‌ను హర్యానా రాష్ట్ర హైకోర్టు కమిషనర్ గా నియమించింది.తన కార్యకలాపాలను వ్యతిరేకించిన పలువురిని గుర్మిత్ సింగ్ తన అనుచరులతో హత్య చేయించి... వారి శవాలను డేరా ఆవరణలోని 70 ఎకరాల్లో పూడ్చి పెట్టి వాటిపై మొక్కలు నాటించాడని అధికారులు చెప్పారు. ప్రస్థుతం డేరా ఆవరణలో మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డేరా హెడ్ క్వార్టర్స్ లో చాలా బంగళాలున్నాయి. ఈ భవనాల్లో గుర్మిత్ సింగ్ కుటుంబసభ్యులతోపాటు ఆయన అనుంగు అనుచరులు వందలాదిమంది శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. డేరాలోనే స్టేడియం, ఆసుపత్రి, విద్యాసంస్థలు, రిసార్టు, మార్కెట్లున్నాయి. డేరా ప్రధాన కార్యాలయం మినీ టౌన్ షిప్ లాగా ఉందని అధికారులు చెప్పారు.

డేరాబాబా ఆయుధాలు, నగలు స్వాధీనం

డేరాబాబా ఆయుధాలు, నగలు స్వాధీనం

డేరా సచ్చా సౌదాలో ఇప్పటికే తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మరోసారి తనిఖీలు నిర్వహించనున్నారు.సిర్సాలో హై అలర్ట్ ప్రకటించారు. సిర్సాలో 40 కంపెనీలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

రూ. 200 కోట్ల ఆస్థి నష్టం

రూ. 200 కోట్ల ఆస్థి నష్టం

డేరా అనుచరులు సృష్టించిన విధ్వంసంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలను పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ.200 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తేల్చింది. ఈ మొత్తాన్ని డేరా నుంచి రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.డేరా బాబాకు శిక్ష విధించిన తర్వాత ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు. దీంతో డేరా ఆశ్రమం నుండే నష్టాన్ని రికవరీ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అల్లర్లలో చనిపోయినవారికి పరిహరం

అల్లర్లలో చనిపోయినవారికి పరిహరం

డేరా బాబాకు శిక్ష ఖరారైనప్పుడు జరిగిన అల్లర్లన్నీ ముందస్తు కుట్రతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినవేనని తేలింది. కోర్టు బాబాను దోషిగా నిర్ధారించి, శిక్ష విధించిన పక్షంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి వ్యూహరచన చేశామని బాబా అనుచరులు ప్రమోద్ కుమార్‌, రాజీవ్‌ సింగ్‌, ఆదిత్య, సురేంద్ర పోలీసుల విచారణలో వెల్లడించారు. అల్లర్లు సృష్టించడానికి వీలుగా పది రోజుల ముందే డేరా అనుచరులు అల్లరిమూకలకు పెట్రోలు, కారం పొడి, హాకీ స్టిక్కులను అందించారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినపక్షంలో నష్టపరిహారం కూడా అందిస్తామని డేరా అనుచరులు అల్లరిమూకలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్ , ఆర్ఏఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

English summary
Hours before authorities and security agencies are likely to start a search and sanitisation operation inside the sprawling Dera Sacha Sauda headquarters campus near Sirsa town in Haryana, the sect's mouthpiece "Sach Kahoon" on Thursday admitted that human remains were buried inside the premises. The search, to be supervised by a court commissioner, is likely to begin today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X