Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

love marriage: ఫస్ట్ నైట్ గడ్డపార దించేసిన భర్త, ఒకే దెబ్బకు భార్య ఫినిష్, బెడ్ రూమ్ లో ఏం జరిగిదంటే !

చెన్నై/ కుప్పం: అత్తకూతురిని ఓ యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు రాత్రి వరకు భార్యను ఒక్కనిమిషం కూడా వదిలిపెట్టకుండా వెంట తిరుగుతూ చాలా సంతోషంగా గడిపాడు. ఫస్ట్ నైట్ అర్దరాత్రి బెడ్ రూంలో నుంచి పెళ్లి కూతురి అరుపులు, కేకలు వినిపించాయి. మొదటి రాత్రి కదా, భార్య, భర్త సరసాలు ఆడుతున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఫస్ట్ నైట్ రోజే జరగరాని దారుణం జరిగిపోయింది. పెళ్లి కూతురి శరీరంపై భర్త గడ్డపార దించేసి అతి దారుణంగా హత్య చేశాడు. బెడ్ రూం నుంచి పారిపోయిన భర్త తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.

 కుప్పం సంధ్యా అంటే ప్రాణం

కుప్పం సంధ్యా అంటే ప్రాణం

తమిళనాడులోని తిరువళ్లారు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామంలో నిధివాసన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నిధివాసన్ క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. నిధివాసన్ అత్త కుమార్తె సంధ్యా (22) సడయన్ కుప్పంలో నివాసం ఉంటున్నది. నిధివాసన్, సంధ్యాను ప్రేమించాడు. నిన్నేప్రేమిస్తున్నా, నిన్నేపెళ్లాడుతా అంటూ సంధ్యాను నిధివాసన్ నమ్మించాడు.

 హ్యాపీగి పెళ్లి చేశారు

హ్యాపీగి పెళ్లి చేశారు

నిధివాసన్, సంధ్యా ఇష్టపడటంతో వారి పెళ్లి చెయ్యడానికి ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించి సంతోషంగా పెళ్లి చేశారు. నిధివాసన్ కు సంధ్యా కుటుంబ సభ్యులు భారీగానే కట్నం కింద డబ్బులు, కొత్త బైక్, బంగారు నగలు, ఇంటికి అవసరం అయిన అన్ని వస్తువులు తీసిచ్చారు. పెళ్లి జరిగిన తరువాత కొన్ని గంటల పాటు నిధివాసన్, సంధ్యా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తమ కుమార్తెను పెళ్లి జరిగిపోయిందని, ఇక ఎలాంటి కష్టాలు ఉండవని సంధ్యా కుటుంబ సభ్యులు సంతోషంగా పడ్డారు.

 ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లోకి ఎంట్రీ

ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లోకి ఎంట్రీ

వివాహం జరిగిన రోజే పెళ్లి కుమార్తె సంధ్యా ఇంటిలో మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి పొద్దుపోయిన తరువాత నవదంపతులు సంధ్యా, నిధివాసన్ బెడ్ రూంలోకి వెళ్లారు. అర్దరాత్రి బెడ్ రూంలో నుంచి సంధ్యా గట్టిగా అరుపులు చేస్తూ కేకలు వేసిన విషయం బంధువులకు వినపడింది. ఫస్ట్ నైట్ లో నవ దంపతులు సరసాలు ఆడుతున్నారని బంధువులు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. సుమారు గంటకు పైగా కేకలు వేసిన సంధ్యా తరువాత సైలెంట్ అయిపోవడంతో ఫస్ట్ నైట్ తో దంపతులు అలిసిపోయారని నవ్వుకున్న అక్కడే ఉన్న సమీప బంధువులు తరువాత నిద్రపోయారు.

 బెడ్ రూమ్ లో గడ్డపార తీసిన మొగుడు

బెడ్ రూమ్ లో గడ్డపార తీసిన మొగుడు

ఉదయం బెడ్ రూం తలుపులు తీసి బయటకు వచ్చిన నిధివాసన్ గట్టిగా కేకలు వేస్తూ ఇంటి నుంచి పరుగు తీశాడు. పెళ్లి కొడుకు అలా పారిపోవడంతో వారి బంధువులకు అనుమాన వచ్చి బెడ్ రూంలోకి వెళ్లి చూశారు. పెళ్లి కూతురు సంధ్యా రక్తపుమడుగులో శవమై కనిపించడంతో షాక్ కు గురైన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి కొడుకు నిధివాసన్ భార్య సంధ్యా శరీరంపై ఎక్కడపడితే అక్కడ గడ్డపారతో పోడిచి అతి దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 పెళ్లికొడుకు వ్యసనాలకు బానిస

పెళ్లికొడుకు వ్యసనాలకు బానిస

సంధ్యాను హత్య చేసిన పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలించారు. సాయంత్రం గ్రామం సమీపంలోని ఓ పెద్ద చెట్టుకు పెళ్లి కొడుకు నిధివాసన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికులు గుర్తించారు. పెళ్లి కొడుకు నిధివాసన్ కొన్ని సంవత్సరాల నుంచి గంజాయి, మద్యం సేవించడానికి అలవాటు పడి వాటికి బానిస అయిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మానసిక వైద్యుడి దగ్గర సుమారు మూడు నెలలకు పైగా నిధివాసన్ చికిత్స చేసుకున్నాడని పోలీసులు అన్నారు. ఈ విషయం బయటకు రావడంతో సంధ్యా కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు.

 పక్కా డ్రామాతో ఇంత జరిగింది

పక్కా డ్రామాతో ఇంత జరిగింది

గంజాయి, మద్యం సేవించడం పూర్తిగా నిలిపివేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించిన నిధివాసన్ అత్తకూతురు సంధ్యాను పెళ్లి చేసుకున్నాడని పోలీసులు అన్నారు. గంజాయి, మద్యంకు బానిస అయిన మానసికరోగి నిధివాసన్ ఫస్ట్ నైట్ భార్య సంధ్యాను అతిదారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పెళ్లి జరిగి 24 గంటలు కూడా పూర్తి కాకముందే భార్య సంధ్యాను హత్య చేసిన నిధివాసన్ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+