ABSOLUTE POLITICO: హైదరాబాద్ సంస్థ ఎగ్జిట్ పోల్ లో షాకింగ్ రిజల్ట్స్-కారణాలు ఇవేనట..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపు ఉందన్న దానిపై ఇవాళ పలు సర్వే, ఎగ్జిట్ సంస్థలు తమ అంచనాల్ని వరుసగా వెల్లడిస్తున్నాయి. ఇందులో పలు జాతీయ, ప్రాంతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ కు చెందిన సర్వే సంస్థ ఆబ్సల్యూట్ పొలిటికో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ ఎగ్జిట్ పోల్ ను ప్రకటించింది. ఇందులో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏకపక్ష విజయం సాధించబోతున్నట్లు తేల్చింది.

Hyderabad based ABSOLUTE POLITICO exit poll predicts landslide victory for bjp in Delhi

ఆబ్సల్యూట్ పొలిటికో ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఢిల్లీ ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 సీట్లలో బీజేపీకి ఏకంగా 43-52 సీట్లు దగ్గబోతున్నట్లు తేలింది. అలాగే అధికార ఆప్ కు కేవలం 15-27 సీట్లు మాత్రమే లభించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు కాంగ్రెస్ కు 0-2 సీట్లు దక్కవచ్చని తెలిపింది. తద్వారా బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో ఏకపక్ష విజయంతో పాగా వేయబోతున్నట్లు ఆబ్సల్యూట్ పొలిటికో ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇంత భారీ స్ధాయిలో గెలవబోతుండటం వెనుక ఉన్న కారణాలను కూడా ఆబ్సల్యూట్ పొలిటికో సంస్థ వెల్లడించింది. ఇందులో ఆప్ అవినీతి కారణంగా వచ్చిన ప్రజా వ్యతిరేకత కీలకమని తెలిపింది. దీంతో పాటు ఢిల్లీలో బీజేపీయేతర ప్రభుత్వం ఉండటం వల్ల తరచుగా కేంద్రంతో తలెత్తుతున్న వివాదాలు ఓటర్లపై ప్రభావం చూపినట్లు తెలిపింది. అలాగే ఆప్, కాంగ్రెస్ మధ్య ఓట్ల చీలిక కూడా కేజ్రివాల్ పార్టీ అవకాశాల్ని దెబ్బతీసిందని విశ్లేషించింది. బీజేపీ ఈసారి ఆప్ కు చెందిన పలువురు కీలక నేతల్ని ఈసారి ఓడించబోతున్నట్లు కూడా అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+