Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జైలు నుంచి ప్రాణాలతో తిరిగి వస్తానో.. రానో

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయి.. ప్రస్తుతం బెయిల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సాయంత్రం తీహార్ కేంద్ర కారాగారంలో సరెండర్ కావాల్సి ఉన్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కేజ్రీవాల్. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ గడువు ఇప్పటికే ముగిసింది. ఈ సాయంత్రం సరెండర్ కావాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ రోస్ అవెన్యూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్‌లో ఉంది.

I don t know when I will come back I am also ready to be hanged says Arvind Kejriwal

ఈ నేపథ్యంలో సరెండర్ కావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించారు. కనాట్ ప్లేస్‌లో గల ప్రఖ్యాత ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లారు. భార్య సునీతతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

కొద్దిసేపటి కిందటే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అధికారం నియంతృత్వంగా మారినప్పుడు.. ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చంటూస్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ చెప్పిన వ్యాక్యాలను ఉటంకించారు.

దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేయడానికి పోరాడిన భగత్ సింగ్‌ను బ్రిటీషర్లు ఉరి తీశారని గుర్తు చేశారు. అధికారం నియంత్రత్వంగా మారిందనడానికి ఆ సంఘటనే ఉదాహరణ అని చెప్పారు.

ఇప్పుడు తాను మళ్లీ జైలుకు వెళ్తున్నానని, ఎప్పుడు తిరిగి వస్తాననేది తనకు తెలియట్లేదని అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్‌ను ఉరి తీశారని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తాను కూడా ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

జైలులో తనను ఏం చేస్తారో తెలియట్లేదని, అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పారు. ప్రతి రక్తపు బొట్టూ, జీవితంలో ప్రతి నిమిషమూ ఈ దేశం కోసమేనని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ బ్రిటీషర్ల నియంతృత్వాన్ని అంతం చేశారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+