భారీ డిపాజిట్లు: లక్ష మందికి ఐటీ నోటీసులు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ చేసిన దాదాపు లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించనున్నారు. ఈ వారంలోనే వాళ్లందరికీ నోటీసులు పంపించనున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

PM Modi's Notes Ban After A Year : What's Changed

రూ.50లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసిన 70వేల మందికి మొదటగా నోటీసులు అందనున్నాయి. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 142(1) కింద ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 I-T to issue 1 lakh notices for huge deposits post demonetisation

గతంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వారి గత ప్రవర్తనను పరిశీలనలోకి తీసుకుని మరో 30వేల మందికి కూడా ఈ నోటీసులు అందనున్నాయి. రూ.25లక్షల నుంచి రూ.50లక్షల మధ్య నగదు డిపాజిట్లు చేసిన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగానే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ.50లక్షలు నగదు చేసిన డిపాజిట్‌ దారులు తమ నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

2016, నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఐటీ శాఖ 900 సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ.900కోట్ల ఆస్తులను సీజ్‌ చేయగా.. వాటిలో రూ.636కోట్ల నగదు కూడా ఉంది. దాదాపు లెక్కలు చెప్పని రూ.7,961కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. అదే సమయంలో జరిపిన సర్వే ఆషరేషన్స్‌లో రూ.6,745కోట్ల బ్లాక్ మనీ గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Income Tax Department is set to issue notices to about one lakh entities and individuals, who deposited huge cash in banks post demonetisation and whose tax returns have been picked for detailed probe into suspected discrepancies, official sources said today.
Please Wait while comments are loading...