కోవిడ్ తర్వాత యువతలో ఆకస్మిక మరణాలెందుకు ? కారణాలపై ఐసీఎంఆర్ అన్వేషణ...

భారత్ తో పాటు పలు దేశాల్ని తీవ్రంగా కుదిపేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం బాగా తగ్గినా ఇంకా మరణాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలు పలు దేశాల్ని కలవరపెడుతున్నాయి. గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న యువతలో ఆకస్మికంగా మరణాలు చోటు చేసుకోవడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. అలాగే దేశంలో ఇలాంటి కేసులు కూడా పెరుగుతుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారిస్తోంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భారత్ లో కోవిడ్ తర్వాత యువకుల ఆకస్మిక మరణాలకు కారణాన్ని అర్థం చేసుకోవడానికి రెండు అధ్యయనాలను నిర్వహిస్తోంది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో చోటు చేసుకుంటున్న మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి కారణాలు లేకుండా మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

icmr studies reasons behind sudden deaths of youth after covid 19

ఎలాంటి తక్షణ కారణాలు లేకుండా దేశంలోని యువతలో చోటు చేసుకుంటున్న మరణాలపై ఐసీఎంఆర్ రెండు అధ్యయనాలు చేస్తంది. ఈ అధ్యయనాలు కోవిడ్ -19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ కారణాలు తెలిస్తే రాబోయే మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని ఐసీఎంఆర్ చెబుతోంది. ఎలాంటి ఇతర తీవ్ర వ్యాధులు లేకుండా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపైనే ఈ అధ్యయనాలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఐసీఎంఆర్ ఢిల్లీ ఎయిమ్స్ లోని 50 ఇలా మరణించిన మృతదేహాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 100 మృతదేహాలపై ఈ అధ్యయనాలు చేయాలని ఐసీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శవాల పోస్టుమార్టం రిపోర్ట్ లను, కోవిడ్ తర్వాత పరిస్ధితులతో పోల్చి చూడటం ద్వారా కారణాలు తెలుసుకుంటున్నట్లు ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ తర్వాత యువతలో ఆకస్మిక మరణాలలో మానవ శరీరాల్లో చోటు చేసుకున్న మార్పుల్ని కూడా తెలుసుకుంటోంది. మరో అధ్యయనంలో గత ఏడాదిలో 18 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఆకస్మిక మరణాల డేటాను తీసుకుని, వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏ జరిగిందో తెలుసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+