• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భార్య ముందే భర్త ఆంటీలతో వీడియో కాల్స్ చేసి ?, ఎదురు తిరిగితే ఏసేశాడు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కలలుకనింది. వివాహం జరిగిన ఆరు నెలలకే దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు రాజీలు చేసి ఇద్దరిని ఒక్కటి చేశారు. దంపతులకు ఓ కూతురు పుట్టింది. రానురాను భర్త తీరుతో భార్య మండిపడుతూ వచ్చింది. పంచాయితీలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. పోలీసులు దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి రాజీచేసి పంపించారు. ఎలాగో తన అక్రమ సంబంధాల గురించి అందరికి తెలిసిపోయిందని అనుకున్న భర్త ఇంట్లో అతని భార్య ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలతో వీడియో కాల్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో దంపతుల మద్య రచ్చ రచ్చ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పక్కాప్లాన్ ప్రకారం భర్త అనుకున్నంతపని చేశాడు. భార్య తల్లికి ఫోన్ చేసిన భర్త మీ కూతరు మెట్ల మీద నుంచి జారిపడిపోయిందని, మాట్లాడటం లేదని చెప్పాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు .అప్పటికే భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మా కూతురిని అల్లుడు చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. భర్త మొబైల్ ఫోన్ లో అతను అనేక మంది మహిళలు, అమ్మాయిలతో చాలా సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు బయటపడటంకలకలం రేపింది.

Businessman: పుట్టింటిలో డాక్టర్ భార్య, అర్దరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కాల్పులు, జస్ట్ మిస్!Businessman: పుట్టింటిలో డాక్టర్ భార్య, అర్దరాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కాల్పులు, జస్ట్ మిస్!

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

చెన్నైలోని వినోద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వినోద్ కు హేమావతి అనే యువతిని ఇచ్చి వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి చేసుకోవడానికి వినోద్, హేమావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2015లో హేమావతి, వినోద్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. వినోద్ ను వివాహం చేసుకున్న హేమావతి ఆమె భర్తతో జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని కలలుకనింది.

వివాహం జరిగిన ఆరు నెలలకే రామాయణాలు

వివాహం జరిగిన ఆరు నెలలకే రామాయణాలు

వివాహం జరిగిన ఆరు నెలలకే వినోద్, హేమావతి దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు రాజీలు చేసి ఇద్దరిని ఒక్కటి చేస్తూ వచ్చారు. హేమావతి, వినోద్ దంపతులకు 5 సంవత్సరాల వయసు ఉన్న ఓ కూతురు ఉంది. కూతురు పుట్టిన తరువాత వినోద్ లో చాలా మార్పులు రావడంతో అతని భార్య హేమావతికి అనుమానం వచ్చింది.

 మహిళలకు ఫోన్ చేసి మాట్లాడుతున్న భర్త

మహిళలకు ఫోన్ చేసి మాట్లాడుతున్న భర్త

పని ముగించుకుని ఇంటికి వెలుతున్న వినోద్ ఇంట్లో ఎక్కువగా పరాయి మహిళలకు ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ హేమావతి ప్రశ్నిస్తే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అంటూ వినోద్ అతని భార్య మీద మండిపడటం మొదలుపెట్టాడు. రానురాను భర్త వినోద్ తీరుతో అతని భార్య హేమావతి మండిపడుతూ వచ్చింది.

పంచాయితీలు చేసిన పోలీసులు

పంచాయితీలు చేసిన పోలీసులు

రానురాను వినోద్, హేమావతిల గొడవలు ఎక్కువ అయ్యాయి. వినోద్, హేమావతి పంచాయితీలు మూడు సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ అయ్యాయి. హేమావతి, వినోద్ ల పంచాయితీలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. పోలీసులు వినోద్, హేమావతి దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇద్దరికి రాజీచేసి సంతోషంగా జీవించాలని సలహా ఇచ్చి పంపించారు.

విచ్చలవిడిగా తయారైన భర్త

విచ్చలవిడిగా తయారైన భర్త


ఎలాగో తన అక్రమ సంబంధాల గురించి అందరికి తెలిసిపోయిందని అనుకున్న వినోద్ ఇంట్లో అతని భార్య హేమావతి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలతో వీడియో కాల్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు. భార్య హేమావతి ప్రశ్నిస్తే ఇప్పటికే నా మీద కేసు పెట్టావు కదా, నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఎదురుతిరిగాడు.

 పక్కాప్లాన్ తో భార్యను చంపేసిన భర్త ?

పక్కాప్లాన్ తో భార్యను చంపేసిన భర్త ?

ఇదే విషయంలో వినోద్, హేమావతి దంపతుల మద్య రచ్చ రచ్చ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పక్కాప్లాన్ ప్రకారం వినోద్ అతని భార్య హేమావతి గొంతు నులిమి చంపేశాడు. తరువాత భార్య హేమావతి తల్లికి ఫోన్ చేసిన వినోద్ మీ కూతరు మెట్ల మీద నుంచి జారిపడిపోయిందని, మాట్లాడటం లేదని చెప్పాడు. వెంటనే హేమావతి అన్న, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని హేమావతిని ఆసుపత్రికి తరలించారు .అప్పటికే హేమావతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు.

భర్త మొబైల్ ఫోన్లలో రాసలీలల భాగోతం

భర్త మొబైల్ ఫోన్లలో రాసలీలల భాగోతం

మా కూతురు హేమావతిని అల్లుడు వినోద్ చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. వినోద్ మొబైల్ ఫోన్ లో అతను అనేక మంది మహిళలు, అమ్మాయిలతో చాలా సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు బయటపడటం కలకలం రేపింది. అయితే పోస్టుమార్టం నివేదికలో హేమావతి ఎలా చనిపోయింది అని కచ్చితమైన సమాచారం తెలిసిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. భార్య హత్య కేసులో వినోద్ మీద కేసు నమోదు కావడంతో అతని మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకాలం వినోద్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అమ్మాయిలు, వినోద్ తో వీడియో కాల్ లో గంటలు గంటలు మాట్లాడిన వివాహిత మహిళలు ఇప్పుడు హడలిపోతున్నారు. వినోద్ భార్య హత్య కేసులో ఎక్కడ మమ్మల్ని పోలీసులు విచారణ చేస్తారో ?, ఎక్కడ మాకు లేనిపోని సమస్యలు వస్తాయో? అంటూ కిలాడీ లేడీలు హడలిపోతున్నారని తెలిసింది. మొత్తం మీద పరాయి స్త్రీల వ్యామోహంలో ఇంతకాలం ఎంజాయ్ చేసిన వినోద్ కు ఇప్పుడు సినిమా కనపడుతోంది.

English summary
Illegal affair: Husband killed Young wife due to illegal relationship near Chennai City in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X