Illegal affair: నాటుకోడిలా కండలు పెంచిన ఆంటీతో ఎంజాయ్, రోడ్డు మీద వెంటాడి చంపిన భర్త !
బెంగళూరు/బళ్లారి: భర్తతో కాపురం చేస్తున్న వివాహిత మహిళ పరిచయం ఉన్న పక్కవీధిలోని యువకుడి మీద మనసుపడింది. అందంగా ఉన్న నాటుకోడి లాంటి ఆంటీ రమ్మని సైగ చెయ్యడంతో అతను తట్టుకోలేకపోయాడు. మంచి ముహుర్తం చూసిన యువకుడు ఆంటీ ఇంట్లో అడుగుపెట్టి ఆమెతో ఎంజాయ్ చేశాడు. భర్త లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుంటున్న ఆంటీ మస్త్ మజా చేసింది. పుట్టింటికి వెళ్లి వచ్చే ముసుగులో రెండు రోజులు ప్రియుడితో కలిసి ఇతర ప్రాంతాలకు వెలుతున్న ఆంటీ జల్సా చేసింది. చాలా కాలం ఆంటీ, యువకుడి అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. ఒకే ప్రాంతంలో ఇద్దరూ నివాసం ఉండటంతో వారు మాట్లాడుకుంటున్న విషయం చూసిన భర్త తెలిసిన వాడే కదా అంటూ సైలెంట్ గా ఉండిపోయాడు. భర్త పని మీద ఊరికి వెళ్లాడు. అదే సమయంలో పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఆంటీ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో దుకాణం పెట్టేసింది. అయితే ఆంటీ, ఆమె ప్రియుడి గ్రహాలు మొత్తం ఒకేసారి రివర్స్ అయ్యాయి. పనిమీద ఊరికి వెళ్లిన భర్త అనుకోకుండా ఇంటికి వచ్చేశాడు. భార్య, ఆమె ప్రియుడిని చూడరాని చోట చూసిన భర్త రగిలిపోయి ఇద్దరిని బెండ్ ఎత్తేశాడు. భార్య, ఆమె ప్రియుడు పద్దతి మార్చుకోకపోవడంతో భర్త అతని స్నేహితుడితో కలిసి హత్యకు స్కెచ్ వేశాడు. బైక్ లో ఇంటికి వెలుతున్న భార్య ప్రియుడిని భర్త అతని స్నేహితుడు సినిమా రైంజ్ లో వెంటాడి నడిరోడ్డులో అతని బైక్ ను ఢీకొట్టి కళ్లలో కారం చల్లి కత్తులతో పొడిచి చంపేయడం కలకం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని హావేరి జిల్లా, శిగ్లాంవి తాలుకాలోని చిక్కచండిగేరి గ్రామంలో చెన్నబసవనగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చెన్నబసవనగౌడకు శైలజా (పేరు మార్చడం జరిగింది) అనే భార్య ఉంది. ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నబసవనగౌడ, శైలజా దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

ఆంటీ భర్త చాలా బిజీ
చెన్నబసవనగౌడ వ్యవసాయం చేయిస్తున్నాడు. రైతుల దగ్గర పండిన పంటలు కొనుగోలు చేస్తున్న చెన్నబసవనగౌడ వాటిని మార్కెట్లకు తరలించి విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. భర్త చెన్నబసవనగౌడ వ్యవసాయం, వ్యాపారం పనుల మీద చాలా బిజీగా ఉంటున్నాడు. ఇంట్లో పిల్లలను చూసుకుంటూ వారికి కావలసిన వంటలు చేసి పెడుతూ శైలజా కాలం గడిపేస్తోంది.

సైలెంట్ గా సైగలు చేసిన ఆంటీ
చెన్నబసవనగౌడ, శైలజా దంపతులు నివాసం ఉంటున్న గ్రామంలోనే ఉమేష్ విరుపాక్షప్ప నందన్న అలియాస్ ఉమేష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శైలజా, ఉమేష్ ఒకే ఊరివాళ్లు కావడంతో వారికి ముందు నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. భర్త చెన్నబసవనగౌడతో చక్కగా కాపురం చేస్తున్న అతని భార్య శైలజా పరిచయం ఉన్న పక్కవీధిలోని యువకుడు ఉమేష్ మీద మనసుపడింది.

తట్టుకోలేకపోయాడు
అందంగా, నాటుకోడిలా కండలు పెంచిన శైలజా ఆంటీ రమ్మని సైగ చెయ్యడంతో ఉమేష్ తట్టుకోలేకపోయాడు. మంచి ముహుర్తం చూసిన ఉమేష్ పక్కవీదిలోని శైలజా ఆంటీ ఇంట్లో అడుగుపెట్టి ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. భర్త చెన్నబసవనగౌడ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు ఉమేష్ కి ఫోన్ చేసి పిలిపించుకుంటున్న శైలజా అతనితో మస్త్ మజా చేసింది.

ప్రియుడితో టూర్ లు, జల్సాలు
పుట్టింటికి వెళ్లి వచ్చే ముసుగులో శైలజా రెండు మూడు రోజులు ప్రియుడు ఉమేష్ తో కలిసి తిరిగేది. ఉమేష్ ఇతర ప్రాంతాలకు వెలుతున్న శైలజా ఆంటీ అతనితో జల్సా చేసింది. చాలా కాలం శైలజా ఆంటీ, ఉమేష్ అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. ఒకే ప్రాంతంలో శైలజా, ఉమేష్ ఇద్దరూ నివాసం ఉండటంతో వారు మాట్లాడుకుంటున్న విషయం చూసిన భర్త చెన్నబసవనగౌడకు తెలిసినా వాడు ఈ ఊరివాడే కదా అంటూ సైలెంట్ గా ఉండిపోయాడు.

గ్రహాలు రివర్స్ తో భర్త ఎంట్రీ
భర్త చెన్నబసవనగౌడ పని మీద ఊరికి వెళ్లాడు. అదే సమయంలో పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శైలజా ఆంటీ ప్రియుడు ఉమేష్ ని ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో దుకాణం పెట్టేసింది. అయితే శైలజా ఆంటీ, ఆమె ప్రియుడు ఉమేష్ కు గ్రహాలు మొత్తం ఒకేసారి రివర్స్ అయ్యాయి. పనిమీద ఊరికి వెళ్లిన భర్త చెన్నబసవగౌడ అనుకోకుండా ఇంటికి వచ్చేశాడు.

బెండ్ తీసినా బుద్దిమారలేదు
భార్య శైలజా, ఆమె ప్రియుడు ఉమేష్ ని బెడ్ రూమ్ లో చూడరాని సీన్ లో చూసిన భర్త రగిలిపోయి ఇద్దరినీ బెండ్ ఎత్తేశాడు. ఇంకోసారి ఇలా జరిగే ఇద్దరిని నడిరోడ్డులో నరికేస్తానని శైలజా, ఉమేష్ కు భర్త చెన్నబసవనగౌడ వార్నింగ్ ఇచ్చాడు. భార్య శైలజా, ఆమె ప్రియుడు ఉమేష్ పద్దతి మార్చుకోకపోవడంతో భర్త చెన్నబసవనగౌడ అతని స్నేహితుడు శంకరగౌడ పాటిల్ తో కలిసి ప్రియుడు ఉమేష్ హత్యకు స్కెచ్ వేశాడు.

భార్య ప్రియుడిని వెంటాడిన భర్త
ఆగస్టు 4వ తేదీన ఉమేష్ పని మీద బైక్ లో శింగ్లావికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి లిక్కర్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసిన ఉమేష్ బైక్ లో ఊరికి బయలుదేరాడు. మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్న శైలజా భర్త చెన్నబసవనగౌడ, అతని స్నేహితుడు శంకరగౌడ పాటిల్ మరో బైక్ లో ఉమేష్ ను వెంబడించారు. ఉమేష్ బైక్ ను ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు.

సినిమా రైంజ్ లో లేపేశారు
కిందపడిపోయిన ఉమేష్ కళ్లల్లో వెంటనే కారం పొడి చల్లేశారు. తరువాత రెండు కత్తులు తీసుకున్న శైలజా భర్త చెన్నబసవనగౌడ, అతని స్నేహితుడు శంకరగౌడ పాటిల్ అతన్ని పొడిచి చంపేసి నిమిషాల్లో తప్పించుకుని పారిపోయి స్నేహితుడి ఊరిలో తలదాచుకున్నారు. ఉమేష్ హత్యకు గురి కావడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. శైలజాతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ఆమె భర్త చెన్నబసవనగౌడ, అతని స్నేహితుడు శంకరగౌడ పాటిల్ అతన్ని పొడిచి చంపారని తెలుసుకుని వారి కోసం గాలించి ఐదు రోజుల తరువాత అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, కత్తులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా ఒకే ఊరి వారి చేతిలో ఉమేష్ హత్యకు గురికావడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications