ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాయి. భారత్ లోనూ గ్యాస్ సిలిండర్, చమురు ధరలపై ఆ ప్రభావం పడింది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ వృద్ధి రేటు మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్రికతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతోందని IMF స్పష్టం చేసింది. 2026-27 సంవత్సరానికి 6.5 శాతంగా వృద్ధి రేటును అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం దృఢంగా ముందుకు సాగుతున్నట్లు IMF పేర్కొంది. ఈ మేరకు రానున్న కాలంలో వృద్ధి రేటు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో 2026-27 సంవత్సరానికి 6.5 శాతంగా వృద్ధి రేటును అంచనా వేస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. అలాగే 2025 లో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని తెలిపింది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాను ఏకంగా 7.6 శాతానికి సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక 2025 నుంచి భారత్ లో దేశీయ డిమాండ్ బలంగా ఉందని రానున్న సంవత్సరంలోనూ ఇది అలాగే కొనసాగుతుందని భారత ఆర్థిక రంగానికి ఈ పరిణామం కలిసొచ్చే అంశంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. అలాగే భారత్ పై అమెరికా టారిఫ్ ల ప్రభావం పెద్దగా పడలేదని.. అమెరికా విధించిన అదనపు సుంకాలు 50 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం ఆసియా ఖండంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు అశించినంత ఆశాజనకంగా లేదు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యం, టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

IMF Projects 6 5 Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions Strong Outlook

ఇక ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే జపాన్ ను భారత్ దాటేసి నాలుగో స్థానానికి చేరింది. రానున్న రోజుల్లో జర్మనీని కూడా దాటేసి మూడో స్థానంలోకి వస్తుందని సమాచారం. ఇక మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+