పిఎన్బీ స్కామ్: మరో ముగ్గురి అరెస్టు, ఆర్బీఐదే "వైఫల్యం"
Recommended Video

న్యూఢిల్లీ/ ముంబై :నీరవ్ మోడీ కుంభకోణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన మరో ముగ్గురు ఉద్యోగులను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పర్యవేక్షణ వైఫల్యం వల్లనే కుంభకోణం జరిగిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ నేపథ్యంలో సిబిఐ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. సిబిఐ ఇదివరకే ఇద్దరిని అరెస్టు చేసింది. తాజాగా అరెస్టయిన అధికారులు పర్యవేక్షణ లోపాలకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురు కూడా ఇది వరకు అరెస్టయిన ఇద్దరు ఉద్యోగుల కన్నా పైస్థాయికి చెందినవారు.

పర్యవేక్షణ వైఫల్యమే
ఓ బ్యాంక్‌కు చెందిన ఓ శాఖలో జరిగిన ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని రిజర్వ్ బ్యాంక్ పసిగట్టలేకపోవడం దాని వైఫల్యమేనని కేంద్ర ఆర్థిక శాఖ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం జరిగిన వైఫల్యం పర్యవేక్షణ లోపానికి సంబంధించిందంటూ ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది.

ఈ ముగ్గురి అరెస్టు
సోమవారం అరెస్టయినవారిలో ఫారిన్ ఎక్స్‌ఛేంజీ డిపార్టుమెంట్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న చీఫ్ మేనేజర్ బచ్చు తివారీ, అదే శాఖలోని మేనేజర్ యశ్వంత్ జోషీ, మరో బ్యాంక్ అధికారి ప్రఫుల్ సావంత్ ఉన్నారు.

వారిపై లుకవుట్ నోటీసులు..
నీరవ్ మోడీపై, మెహుల్ చోక్సీపై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. తగిన సాక్ష్యాధారులను సేకరించడానికి సిబిఐ అధికారులు మరోసాని పంజాబ్ నేషలన్ బ్యాంక్ బ్రాంచ్‌లో సోదాలు నిర్వహించారు.

ఈడి మరిన్ని దాడులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరిన్ని దాడులు నిర్వహించింది. రూ.22 కోట్ల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఏడు ఆస్తులను ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, జెమ్స్ విలువ రూ.5,671 కోట్ల రూపాయలు ఉంటుంది.

నీరవ్ మోడీ నివాసంలో సోదాలు
కేసుకు సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి బ్యాంకుకు చెందిన ఇద్దరు పిఎన్బీ, ఆర్థిక శాఖ అధికారులను కలిశారు. దక్షిణ ముంబైలోని వొర్లి అప్‌మార్కెట్‌లో ఉన్న మోడీకి చెందిన సముద్ర మహల్ అపార్టుమెంట్స్‌లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబై, పూణే, ఔరంగాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, జమ్మూ, లక్నో, బెంగళూరు, సూరత్, తదితర నగరాల్లోని 38 చోట్ల సోదాలు కూడా జరిగాయి.

ఆ కంపెనీలపైనా విచారణ
మోడీకి, చోక్సికి చెందిన 110 కంపెనీలు 10 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్‌లపై విచారణ జరపాలని ప్రభుత్వం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసును ఆదేశించింది. వరుసగా మూడో రోజు కూడా పిఎన్బీ షేర్ వాల్యూ పడిపోయింది. పిఎన్బీ షేర్ వాల్యూ 7.2 శాతం పడిపోగా, చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ షేర్ వాల్యూ 9.9 శాతం పడిపోయింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications