సీఈసీపై అభిశంసన..! బీహార్ ఎన్నికల వేళ విపక్షాల బ్రహ్మాస్త్రం..!

కర్నాటక, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతోందని, ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై గళమెత్తుతున్న విపక్ష నేత రాహుల్ గాంధీపై ఈసీ బెదిరింపులకు దిగింది. వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయండి, లేకపోతే క్షమాపణలు చెప్పాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే పోలింగ్ బూత్ ల్లో సీసీ ఫుటేజ్ ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. దీనిపై మండిపడుతున్న విపక్షాలు ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో నుంచి ఏకంగా 65 లక్షల ఓటర్లను తొలగించి, ఆ వివరాలను బయటపెట్టేందుకు కూడా నిరాకరిస్తున్న ఈసీపై ఆగ్రహంగా ఉన్న సుప్రీంకోర్టు తిరిగి రేపటి లోగా వాటిని ఆన్ లైన్ లో పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసీ బీహార్లో జిలాల వారీగా వాటి వివరాలు బయటపెట్టింది. అయితే వాటి తొలగింపును మాత్రం సమర్ధించుకుంటోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణల్ని తిప్పికొడుతూ తమ చర్యల్ని సమర్ధించుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

india bloc plans impeachment motion against CEC gyanesh kumar amdi vote chori allegations

ఇవాళ ఉదయం పార్లమెంట్ లో సమావేశమైన విపక్షాల నేతలు సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు జడ్డీల తరహాలోనే సీఈసీపైనా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు కోరుతూ విపక్షాలు తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇండియా కూటమిపై ఆయన చేసిన విమర్శలను ఇందుకు కారణంగా చూపే అవకాశం ఉంది. అయితే ఇది అమలు కావాలంటే మాత్రం పార్లమెంట్లో మూడింటి రెండొంతుల ఎంపీల మెజార్టీ అవసరం. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది అసాధ్యం కావచ్చని తెలుస్తోంది.

india bloc plans impeachment motion against CEC gyanesh kumar amdi vote chori allegations

అయితే విపక్షాలు ఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే మాత్రం అది బీహార్ ఎన్నికల వేళ పెను సంచలనమే కానుంది. ఎందుకంటే బీహార్ లో ఇప్పటికే 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ చర్యల్ని ఈసీ సమర్థించుకోలేక ఇబ్బందులు పడుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈసీని ఈ విషయంలో ఏకిపారేస్తోంది. ఇలాంటి సమయంలో విపక్షాలు ఈ చర్చను బీహార్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఇదే మంచి అవకాశంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+