Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్‌న్యూస్: 2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

న్యూఢిల్లీ: రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ మంచి వార్త చెప్పింది. దేశంలో 2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. దీర్ఘకాల సగటు (LPA)తో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వచ్చే సీజన్‌లో ఎల్పీఏ 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది.

లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండటం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. కాగా, వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్​‌లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

India likely to experience above-normal rainfall in 2024 monsoon IMD

జూన్‌ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ అధిపతి మృత్యుంజయ్ మహపాత్ర సోమవారం వెల్లడించారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్‌ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు.

మరోవైపు, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇలాంటి అంచనాలనే వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+