వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరంకుశత్వానికి భారత్‌- భారీగా దేశద్రోహం, పరువునష్టం కేసులు- స్వీడన్ రిపోర్ట్‌ షాకింగ్‌

|
Google Oneindia TeluguNews

భారత్‌లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన ప్రజాస్వామ్య నివేదికలోనూ ఇవే అంశాల్ని ప్రస్తావించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ఎన్నికల నిరంకుశత్వానికి భారత్‌ మరలుతోందంటూ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు పలు కారణాలను సోదహరణంగా వివరించింది. తద్వారా భారత్‌లో ప్రజాస్వామ్యం ఉపఖండంలోని పొరుగుదేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కంటే దారుణమైన పరిస్ధితులు నెలకొన్నాయంటూ ఈ రిపోర్ట్‌ పేర్కొంది.

స్వీడన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంచలన రిపోర్ట్‌

స్వీడన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంచలన రిపోర్ట్‌

భారత్‌లో వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులను అణగదొక్కడం, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమకు నచ్చని వారిపై దేశద్రోహం, పరువునష్టం కేసులు పెట్టడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నార్సీ ఆందోళనల సందర్భంగా కేంద్రం పలువురు సామాజిక కార్యకర్తలపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. యూపీ డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌తో పాటు వరవరరావు వంటి వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. మతమార్పిళ్ల విషయంలోనూ కొత్త చట్టాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో భారత్‌లో ప్రజాస్వామ్యానికి ఇవన్నీ తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన వార్షిక ప్రజాస్వామ్య నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వానికి భారత్‌

ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వానికి భారత్‌


స్వీడన్ వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిరంకుశత్వం వైరల్‌ అవుతోందనే పేరుతో ఓ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఇందులో భారత్‌ గురించి ప్రస్తావిస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్యం నుంచి ఎన్నికల నిరంకుశత్వానికి భారత్‌ మళ్లుతోందని పేర్కొంది. అలాగే మీడియాను అణగదొక్కడం, పరువునష్టం, దేశద్రోహం కేసుల వాడకం పెరగడం వంటి అంశాల్ని ప్రస్తావించింది. 1789 నుంచి 2020 వరకూ 202 దేశాలకు దాదాపు 30 డేటా పాయింట్లతో ప్రజాస్వామ్యంపై అతిపెద్ద డేటా సెట్‌ను రూపొందించినట్లు ఈ రిపోర్ట్‌ పేర్కొంది. ఇందులో తన ప్రపంచంలోని స్వేచ్ఛా నివేదికలో భారత దేశాన్ని పాక్షికంగా స్వేచ్ఛాయుత దేశంగా తెలిపింది.

పాకిస్తాన్‌ బాటలో, బంగ్లా కంటే దారుణంగా

పాకిస్తాన్‌ బాటలో, బంగ్లా కంటే దారుణంగా


స్వీడన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిపోర్ట్ ప్రకారం 0-1 పాయింట్ల మధ్య ఉండే ప్రజాస్వామ్య పట్టికలో భారత్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్కోరు 0.57 పాయింట్లు 2013లో నమోదు చేసింది. 2020 చివరి నాటికి ఇది 0.34కు తగ్గిపోయింది. గత పదేళ్లలో భారత్‌ ప్రజాస్వామ్య పట్టికలో 23 పాయింట్లు నష్టపోయింది. 2014లో కేంద్రంలో బీజేపీ విజయం, ఆ తర్వాత హిందూత్వ అజెండా అమలు దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. దీని ప్రకారం చూస్తే పాకిస్తాన్ బాటలోనే భారత్‌ ఇప్పుడు నిరంకుశంగా కనిపిస్తోందని, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, నేపాల్ కంటే భారత్‌లో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని ఈ రిపోర్ట్‌ పేర్కొంది.

‌ మోడీ హయాంలో 7 వేల మందిపై దేశద్రోహం కేసులు

‌ మోడీ హయాంలో 7 వేల మందిపై దేశద్రోహం కేసులు

భారత్‌లో మోడీ సర్కారు విమర్శకుల నోళ్లు మూయించడానికి దేశద్రోహం, పరువునష్టం, ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తోంది. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక 7 వేల మందికి పైగా దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది అధికార పార్టీని విమర్శిస్తున్న వారే. జర్నలిస్టుల నోళ్లు మూయించడానికి పరువునష్టం కేసులు పెడుతున్నారని ఈ నివేదిక తెలిపింది. అలాగే చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ) కూడా వాడుతున్నట్లు తెలిపింది. సీఏఏ నిరసనల్లో పాల్గొన్న వారిపై ఈ చట్టాన్ని ఎక్కువగా ప్రయోగించినట్లు నివేదిక తెలిపింది. దీంతో హిందూత్వ ఉద్యమంలో భాగంగా ఉన్న సంస్ధలు స్వేచ్ఛాయుతంగా ఉండగా, పౌర సమాజం ఎక్కువగా ఇబ్బందులు పడుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

English summary
The fifth annual democracy report by Sweden’s V-Dem Institute, titled ‘Autocratisation goes viral’, has downgraded India from “the world’s largest democracy” to an “electoral autocracy”, citing “muzzling” of the media, and overuse of defamation and sedition laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X