భారీగా తగ్గిన కరోనా కేసులు - పెరుగుతున్న మరణాల సంఖ్య : 7.98 శాతం పాజిటివిటీ రేటు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,68,98,17,199 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

కొనసాగుతున్న తీవ్రత
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 5,01,114 గా ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య.. 13,31,648గా నమోదైంది. కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారు 4,02,47,902 గా ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 29 లక్షల మందికి కరోనా సోకింది. 11,284 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,743,109 కు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కేసుల నమోదు కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా..
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కు చేరుకోగా.. రికవరీ కేసులు 21,94,359కు పెరిగాయి..
మృతుల సంఖ్య 14,646కు పెరిగింది. తెలంగాణలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,387 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,74,215కు పెరిగింది.. ఇక, 4,559 మంది పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 7,39,187కు చేరింది.

ప్రపంచ దేశాల్లో తీవ్రంగానే
అమెరికాలో కొత్తగా 2.81 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. 2,619 మంది మరణించారు.ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.41 లక్షలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మరో 355 మంది చనిపోయారు.బ్రెజిల్లో కొత్తగా 2.19 లక్షల మందికి వైరస్ సోకగా.. 1,068 మంది చనిపోయారు.రష్యాలో తాజాగా 1.68 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 682 మంది బలయ్యారు.జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2.35 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 165 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications