ఏప్రిల్‌లో పతాకస్ధాయికి సెకండ్‌ వేవ్‌-లాక్‌డౌన్‌ కాదు వ్యాక్సిన్లే మందు- SBI రిపోర్ట్

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. అదే సమయంలో రికవరీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో అధికారుల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ అంచనాలు వెలువరించింది. ఎస్‌బీఐ తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ పతాక స్ధాయికి వెళ్లబోతోంది.

ఎస్‌బీఐ తాజా నివేదిక ప్రకారం భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. వంద రోజుల్లోనే ఇది పతాక స్ధాయికి వెళ్లబోతోంది. అంటే ఏప్రిల్‌ రెండో వారానికి ఇది పతాకస్ధాయికి వెళ్లబోతున్నట్లు ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. మార్చి 23 వరకూ ట్రెండ్స్‌ గమనిస్తే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 25 లక్షలకు చేరబోతున్నట్లు ఎస్బీఐ నివేదికలో వెల్లడించింది. లాక్‌డౌన్‌ల విధింపు వల్ల కూడా ప్రయోజనం లేదని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తేనే ఫలితం ఉంటుందని తెలిపింది.

Indias Current Covid Wave Could Peak In 2nd Half Of April: SBI Report

కరోనా ఫస్ట్‌ వేవ్‌ ఆధారంగా ప్రస్తుత కేసుల్ని అంచనా వేస్తే ఏప్రిల్‌ మధ్య భాగంలో దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పతాక స్దాయికి వెళ్తుందని భావిస్తున్నట్లు కేంద్రానికి సమర్పించిన 28 పేజీల నివేదికలో ఎస్బీఐ పేర్కొంది. అయితే ప్రస్తుత కేసుల తీవ్రత చూస్తుంటే పలు రాష్ట్రాల్లో విధించిన, విధించబోతున్న లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు మందగిచ్చవచ్చని ఎస్బీఐ అంచనా వేస్తోంది. దీనికి విరుగుడుగా ప్రస్తుతం రోజుకు 34 లక్షల డోసులుగా ఉన్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 40-45 లక్షలకు పెంచాలని ఎస్బీఐ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+