ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు - ఈ రైళ్లకే పరిమితం..!!

రైల్వే శాఖ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రైళ్లతో పాటుగా వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే.. మరి కొన్ని కీలక రైళ్లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మరి కొన్ని రైళ్లకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హోదా తప్పించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. ఈ మార్పులతో టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 47 రైళ్లలో జనవరి 1వ తేదీ నుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి.

ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంపిక చేసిన రైళ్లలో టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ప్రయాణించే తరగతులకు అనుగుణంగా ఒక్కో టికెట్ పైన రూ 15 నుంచి రూ 75 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ తాజాగా 47 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చ నుంది. నిర్దేశిత మార్గంలో సూపర్ ఫాస్ట్ వేగం అందుకోనందున జనవరి 1 నుంచి ఈ రైళ్లకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హోదా తప్పించి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్పు చేస్తోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, రెగ్యూలర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు టికెట్ ధరలు వేర్వేరుగా ఉండటం తో.. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని టికెట్ ధరలే వీటికి వర్తించనున్నాయి. కాగా, ఈ రైళ్ల నిర్వహణ వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేసారు.

బొత్స వర్సెస్ మజ్జి, జెడ్పీ పీఠం ఆమెదే - అక్కడే లెక్క మారింది..తేల్చేసిన పోలింగ్..!?
బొత్స వర్సెస్ మజ్జి, జెడ్పీ పీఠం ఆమెదే - అక్కడే లెక్క మారింది..తేల్చేసిన పోలింగ్..!?
indian-railways-may-reduce-ticket-prices-on-47-trains-from-january-1-2027-here-the-details

రైళ్ల నెంబర్ల మార్పు.. తాజా నిర్ణయాలు

అదే విధంగా మొత్తం 18 రైళ్లకు ఉన్న 'సూపర్‌ఫాస్ట్' హోదాను తొలగించి, వాటిని సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పు కారణంగా ప్రయాణికులపై పడుతున్న సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ భారం పూర్తిగా తగ్గనుంది. కాగా.. కొన్ని రైళ్లకు కొత్త నంబర్లను కేటాయించను న్నారు. ప్రయాణికులు జనవరి 1 నుంచి ప్రయాణం చేసే సమయంలో ఈ కొత్త నంబర్లు, ఛార్జీల వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులు సూచన చేస్తు న్నారు. ధరలు తగ్గే రైళ్ల జాబితాలో సెంట్రల్ రైల్వే పరిధిలో CSMT-పూణే ప్రగతి, LTT-అయోధ్య కంటోన్మెంట్ తులసితో సహా 18 సర్వీసులు ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో సప్త క్రాంతితో సహా 20 సర్వీసులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఈ రైళ్లల్లో రిజర్వేషన్ చేయించుకునే వారికి తగ్గింపు ధరలతో టికెట్లు జారీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+