Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ డేట్ ఫిక్స్..! రూట్లు ఇవే..!

భారత్ లో తొలి బుల్లెట్ రైలు పట్టాలపైకి పరుగులు తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది దీనికి సంబంధించిన కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు రైల్వేశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఏయే రూట్లలో ముందుగా ప్రయాణం సాగించబోతోందన్న కీలక వివరాల్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ అధికారికంగా వెల్లడించారు.

ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌లో భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ఆగస్టు 15, 2027న ప్రారంభిస్తామని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనంతరం దశలవారీగా సూరత్ నుండి బిలిమోరా వరకు విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. సూరత్-బిలిమోరా మధ్య మొదటి దశ 2027లో ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. తరువాత వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్, థానే-అహ్మదాబాద్ అలా సాగుతూ.. 2029 నాటికి పూర్తి ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందన్నారు.

India s 1st Bullet Train by Independence Day 2027 Key Phases Unveiled

ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య మొత్తం 508-కి.మీ బుల్లెట్ ట్రైన్ కారిడార్ జపనీస్ షింకన్‌సెన్ టెక్నాలజీతో రూపొందిస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. అలాగే బుల్లెట్ రైలు 320 కి.మీ.వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ ప్రయాణాన్ని రెండు గంటల కంటే తక్కువకు ఇది తగ్గిస్తుందన్నారు. 2029 నాటికి కారిడార్ మొత్తం పూర్తిగా రాకపోకలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

India s 1st Bullet Train by Independence Day 2027 Key Phases Unveiled

ఇప్పటికే బుల్లెట్ రైలు మార్గం 2025 డిసెంబర్ నాటికి 55 శాతం పూర్తయిందని, 330 కి.మీ మేర వయాడక్ట్‌లు, 408 కి.మీ. మేర పిల్లర్లు, 17 నది వంతెనలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో బీకేసీ-షిల్ఫాటా సొరంగంలో 5 కి.మీ.ల టన్నెలింగ్ పనులు, 235 కి.మీ.ల పొడవునా 4.7 లక్షల శబ్ద అడ్డంకులు తొలగించడం వంటి పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుపై రూ.858 బిలియన్లు ఖర్చుచేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+