'పవర్'లో మోడీ ప్రభుత్వం రికార్ట్: ఏడాదిలో అద్భుతం!
మన దేశంలో గత ఏడాది విద్యుత్ సరఫరాలో అద్భుతమైన మెరుగుదల కనిపించిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2017 సర్వేలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: మన దేశంలో గత ఏడాది విద్యుత్ సరఫరాలో అద్భుతమైన మెరుగుదల కనిపించిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2017 సర్వేలో వెల్లడైంది.
తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా గతంలో కంటే ఎంతో కొంత మెరుగ్గా ఉందని 41 శాతం మంది ఈ సర్వేలో వెల్లడించారు. తమ ప్రాంతంలో గతం కంటే చాలా బాగుందని 15 శాతం మంది చెప్పారు. మొత్తంగా 55 శాతం మంది విద్యుత్ సరఫరాలో మెరుగుదల కనిపించినట్లు వెల్లడించారు.

మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ఉర్జా పోర్టల్‌లో ఇందుకు సంబంధించిన డాటా వివరాలు ఉన్నాయి. గత ఏడాదిగా దేశంలో పవర్ కట్స్ సమయం క్రమంగా తగ్గింది. దేశం మొత్తంలో 2016 జూలైలో నెలకు 16.33 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. అది 2017 జూలై నాటికి నెలకు 9.21 గంటలకు తగ్గింది. మినిస్ట్రీస్ ఆఫ్ పవర్ పోర్టల్‌లో దేశంలోని 1000 టౌన్‌ల విద్యుత్ సరఫరా పరిస్థితుల వివరాలు ఉన్నాయి.
వినియోగదారులు ఉర్జా పోర్టల్ www.urjaindia.co.in లో వీక్షించవచ్చు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800 200 3004కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పవర్‌కు సంబంధించిన అన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వినియోగదారులు 1912కు ఫోన్ చేసి విద్యుత్‌కు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు, పెండింగ్ ఫిర్యాదుల సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. జూలై 2016 నాటికి 16.6 శాతం ఉంటే జూలై 2017 నాటికి 9.2 శాతానికి తగ్గింది. ప్రజలు భాగస్వామ్యం, ఫీడ్ బ్యాక్ కారణంగా మెరుగైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడింది.
ఇదే ఉత్సాహంతో భారత ప్రభుత్వం 24X7 విద్యుత్ అందించే దిశగా ముందుకు వెళ్తోంది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications