Seat belts in Buses: ఇక బస్సుల్లోనూ సీట్ బెల్ట్ తప్పనిసరి ?
భారత్ లో ప్రస్తుతం మనం వినియోగిస్తున్న చిన్న, మధ్యతరహా నాలుగు చక్రాల వాహనాలు అంటే కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్ట్ లు తప్పనిసరి చేశారు. అయినా వీటిని వాడకుండా ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే బస్సులు, లారీలతో పాటు ఇతర భారీ వాహనాల్లో మాత్రం ఎందుకు సీట్ బెల్ట్ లు ఉండడం లేదనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దీనికి సమాధానంగా ఇప్పుడు వాటిలోనూ సీట్ బెల్ట్ వాడకాన్ని తీసుకురానున్నారు.
భారత్ లో ప్రస్తుతం ఉన్న రోడ్లపై ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల్లో కేవలం కార్లే కాదు భారీ వాహనాలు ఎన్నో ఉంటున్నాయి. వీటిలో బస్సులు, లారీలు, ట్రక్కులు ఇలా భారీ వాహనాలు ఏదో ఒక సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో డ్రైవర్లతో పాటు ఇతర ప్రయాణికులకు సీట్ బెల్ట్ లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు బస్సులతో పాటు భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి చేయాలని అంతర్జాతీయ రహదారి సమాఖ్య కేంద్రానికి సూచించింది.

అంతర్జాతీయంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కఠిన మైన భద్రతా ప్రమాణాలు పాటించడం వల్ల భారీ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు సైతం సురక్షితంగా ఉంటున్నారని, కానీ భారత్ లో అలాంటి చర్యలు లేకపోవడం వల్ల స్కూలు బస్సుల్లో సైతం పిల్లలు మృత్యువాత పడుతున్నారని అంతర్జాతీయ రహదారి సమాఖ్య కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది. ఇప్పటికైనా కేంద్రం బస్సులతో పాటు ఇతర భారీ వాహనాల్లో సీట్ బెల్ట్ ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని కోరింది. దీనిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications