• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీ మరియు ఖతార్‌లో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ; దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు

|
Google Oneindia TeluguNews

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను టెర్రర్ ఫండింగ్ మరియు గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో లింకులు కలిగి ఉన్నాయని భారత ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్న 250 మందిని అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు.

విదేశాలలో పీఎఫ్ఐ కి ఉన్న లింకులపై దర్యాప్తు

విదేశాలలో పీఎఫ్ఐ కి ఉన్న లింకులపై దర్యాప్తు

విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో ఈ సంస్థకు సంబంధాలున్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి టర్కీలోని ఉగ్రవాద సంస్థలతో మరియు భారతదేశంలో తన కార్యకలాపాలను నిర్వహించడానికి ఖతార్ నుండి సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఇతరులతో ఉన్న సంబంధాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

నిధుల కోసం ఖతార్ కు వెళ్లినట్టు గుర్తించిన దర్యాప్తు సంస్థలు

నిధుల కోసం ఖతార్ కు వెళ్లినట్టు గుర్తించిన దర్యాప్తు సంస్థలు


తమ సంస్థకు నిధుల కోసం వెతుకుతూ, కొంతమంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు అంతకుముందు ఖతార్‌కు వెళ్లి కొంతమంది టర్కిష్ జాతీయులను కలిశారని, దాని జాతీయ కార్యవర్గ సభ్యులు రహిమాన్ మరియు కోయాలకు ఇస్తాంబుల్‌లో ఆతిథ్యం ఇచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న పలువురు గతంలో కూడా ఐఎస్‌ఐఎస్‌లో చేరారని దర్యాప్తు సంస్థల అధికారులు చెబుతున్నారు.

గతంలోనే టర్కీ ఉగ్ర లింకులపై పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్

గతంలోనే టర్కీ ఉగ్ర లింకులపై పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్


గతంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న కేసులో, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేరళలోని కన్నూర్ నివాసి మహ్మద్ ఇస్మాయిల్ మొహిదీన్‌తో పాటు మరొక వ్యక్తిని జూలై 2017 లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాద ఆరోపణల నేపధ్యంలో టర్కీ అధికారులు వారిని బహిష్కరించిన తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. నిందితుడు షాజహాన్ వి.కె. మరియు అదే సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారిగా టర్కీ నుండి బహిష్కరించబడిన తరువాత అతను ఇస్మాయిల్ మొహిదీన్ పేరు మీద పాస్‌పోర్ట్ తీసుకున్నట్టు వెల్లడించారు. షాజహాన్ 2006లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కి పూర్వ సంస్థ అయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతను స్థానిక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులతో పరిచయం పెంచుకున్నాడు. 2008లో దాని సమావేశాలకు హాజరయ్యాడని గుర్తించారు.

ఐఎస్ఐఎస్ భావజాలం.. టర్కీ, సిరియా వెళ్ళిన పీఎఫ్ఐ సభ్యులు

ఐఎస్ఐఎస్ భావజాలం.. టర్కీ, సిరియా వెళ్ళిన పీఎఫ్ఐ సభ్యులు

వలపట్టణంలోని అప్పటి పిఎఫ్‌ఐ డివిజనల్ ప్రెసిడెంట్ షమీర్, షాజహాన్‌కు ఐఎస్‌ఐఎస్ భావజాలాన్ని పరిచయం చేశాడని, ఐఎస్‌ఐఎస్‌కు చెందిన అబూ బకర్ బగ్దాదీ కాలిఫేట్ ప్రకటన తర్వాత టర్కీ, సిరియా వెళ్లేలా ప్రేరేపించాడని ఆరోపించారు. అప్పటికే సిరియాలో ఉన్న షమీర్ సూచన మేరకు నిందితుడు తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి 2016 అక్టోబర్‌లో మలేషియా వెళ్లి ఆ తర్వాత ఇరాన్‌కు వెళ్లాడు. ఇరాన్‌లో, మంగళూరు మరియు దుబాయ్ మీదుగా అక్కడికి చేరుకున్న షాజిల్ మరియు అతని కుటుంబం వారితో చేరి, ఇస్తాంబుల్‌కు వెళ్లారు. ఫిబ్రవరి 2017లో, షాజహాన్‌ను పట్టుకుని భారతదేశానికి అప్పగించినప్పుడు కొంతమంది వ్యక్తులు సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

సిరియాకు వలస వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్లాన్ .. గుర్తించిన దర్యాప్తు సంస్థలు

సిరియాకు వలస వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్లాన్ .. గుర్తించిన దర్యాప్తు సంస్థలు

2017 డిసెంబర్‌లో నమోదైన మరో ఐఎస్‌ఐఎస్‌కు సంబంధించిన కేసులో, కొంతమంది యువకులు సిరియాకు వలస వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేరళ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ వ్యవహారంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో చాలామంది సంబంధం కలిగి ఉన్నారు. గల్ఫ్ దేశానికి తిరిగి వచ్చిన హమ్జా కేరళకు చెందిన యువకులను ఐఎస్‌ఐఎస్‌లో చేర్చుకోవడం వెనుక సూత్రధారి గా ఉన్నారని అధికారులు గుర్తించారు. అతను కొంతమంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మద్దతుదారులతో స్నేహం చేశాడు, అయితే సమీర్ వివిధ దేశాల ద్వారా సిరియాకు వెళ్లడానికి కార్యాచరణ ప్రణాళికను అందించాడు, అని అధికారి తెలిపారు.

అంతర్జాతీయ ఉగ్ర లింకులపై కొనసాగుతున్న దర్యాప్తు

అంతర్జాతీయ ఉగ్ర లింకులపై కొనసాగుతున్న దర్యాప్తు


అనంతరం హంజా సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్‌ఐఏ విచారణ చేపట్టి 17 మంది నిందితులపై చార్జిషీటు వేసింది. ఇలా ఇప్పటికే అనేక మార్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు టర్కీ మరియు ఖతార్ లలో ఉగ్రవాద సంస్థలతో లింకులు కొనసాగించారని, దీనిపై విచారణ చేస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థల అధికారులు వెల్లడించారు.

English summary
Investigation agencies investigating the relations of Turkey and Qatar terror links with PFI. Aggressive investigative agencies are working to uncover several key facts in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X