లలిత్ మోడీది రోజుకో మాట, పూటకో పేరు: గౌడ

బెంగళూరు: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వీ. సదానంద గౌడ మండిపడ్డారు. రాజకీయ కుట్రలలో భాగంగానే లలిత్ మోడీ రోజుకు ఒకరి పేరు బయట పెడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజుకు ఒకరి పేరు తెర మీదకు తెస్తున్న లలిత్ మోడీ అందరిని అయోమయంలో పడేటట్ల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో కొందరి పేర్లు బయట పెట్టి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

IPL chief Lalit Modi is making all attempts to shield himself and shift the burden on the politicians

నిన్న ఒకరి పేరు, నేడు చూస్తే ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా పేర్లు బయటపెట్టాడని అన్నారు. రేపు ఇంకొకరి పేరు చెబుతారు, తరువాత మరొకరి పేరు చెబుతారని ఇలా ఎంత మంది పేర్లు చెబుతాడో అతనికే తెలియాలని సందానంద గౌడ అన్నారు.

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ ఎంత మంది పేర్లు చెప్పినా చట్టం నుండి తప్పించుకొలేడని సదానంద గౌడ హెచ్చరించారు. చట్టపరంగా లలిత్ మోడీ మీద చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+