వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో చాపకింద నీరులా టెర్రరిజం .. ఏపీ, తెలంగాణాతో పాటు 12 రాష్ట్రాల్లో చురుగ్గా ఐఎస్ కార్యాకలాపాలు

|
Google Oneindia TeluguNews

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ సహస్రా బుద్దే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు . దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఐఎస్ ఐ ఉగ్రవాదులు ఎక్కువగా చురుకుగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో ఐఎస్ ఉనికికి సంబంధించి 17 కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసి 122 మంది నిందితులను అరెస్టు చేసిందని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్

12 రాష్ట్రాలలో ఐఎస్ అత్యంత చురుకుగా ఉందన్న ఎన్ఐఏ దర్యాప్తు

12 రాష్ట్రాలలో ఐఎస్ అత్యంత చురుకుగా ఉందన్న ఎన్ఐఏ దర్యాప్తు

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మొత్తం 12 రాష్ట్రాలలో ఐఎస్ అత్యంత చురుకుగా ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఐ ఎస్ ఐ లో చేరిన సందర్భాలు కొన్ని ఉన్నాయని, ఇది కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల దృష్టికి వచ్చిందని అన్నారు.

 సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి : వెల్లడించిన మంత్రి

సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి : వెల్లడించిన మంత్రి

ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తోందని కిషన్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ విషయంలో సైబర్‌స్పేస్‌ను సంబంధిత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయని , భారత ఏజెన్సీలు నిఘా పెట్టాయని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు సోషల్ మీడియాని ప్లాట్ ఫామ్ గా చేసుకొని ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు కిషన్ రెడ్డి.

Recommended Video

Terrorist Camps In POK Full,Army successfully Sealed The Border - Lt Gen Raju
ఏపీ, తెలంగాణాలోనూ ఉగ్రవాద కార్యాకలాపాలు

ఏపీ, తెలంగాణాలోనూ ఉగ్రవాద కార్యాకలాపాలు

ఇస్లామిక్ స్టేట్ , ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు లెవాంట్ , ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా , డైష్ , ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ISKP) , ఐసిస్ విలాయత్ ఖోరాసన్ , ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు షామ్-ఖొరాసన్ (ఐసిస్-కె) సంస్థలన్నీ ఉగ్రవాద సంస్థలుగా తెలియజేయబడ్డాయని కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 యొక్క మొదటి షెడ్యూల్‌లో చేర్చబడ్డాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వివరాలను బట్టి భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది.


ఇక ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా కూడా ఉండటం గమనార్హం .

English summary
The Centre asserted that Islamic State terrorists are most active in the southern states of the country. The National Investigation Agency (NIA) has registered 17 cases related to the presence of IS in Telangana, Kerala, Andhra Pradesh, Karnataka and Tamil Nadu and arrested 122 accused persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X