Mysore Pak: మైసూర్ పాక్ లో "పాక్" తీసేస్తున్న స్వీట్ షాప్స్-కొత్త పేరు ఇదే...!
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ లో పరిస్ధితులు వేగంగా మారిపోయాయి. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ఎన్నడూ లేనంత స్ధాయిలో ప్రజలు బయటికి వచ్చి మద్దతు తెలిపారు. అలాగే ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయినా ఇప్పటికీ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఆగ్రహంగా ఉన్న జనం ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో పాక్ అనే పేరును తమ నిత్యజీవితంలో నుంచి తొలగించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ డ్రోన్ దాడుల్ని ఎదుర్కొన్న పశ్చిమ సరిహద్దు రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజధాని జైపూర్ లో స్వీట్ వ్యాపారులు తాము అమ్మే మైసూర్ పాక్ పేరులో నుంచి పాక్ ను తీసేస్తున్నారు. దీని స్ధానంలో మరో కొత్త పేరును మైసూర్ కు తగిలిస్తున్నారు. దీంతో ఇప్పుడు స్వీట్ షాపుల్లో మైసూర్ పాక్ లు కాస్తా ఈ కొత్త పేరుతోనే దర్శనమిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

జైపూర్ స్వీట్ షాపుల వ్యాపారులు మైసూర్ పాక్ లోని పాక్ తీసేసి శ్రీ అనే పేరును జోడిస్తున్నారు. దీంతో మైసూర్ పాక్ కాస్తా మైసూర్ శ్రీగా మారిపోయింది. అంతే కాదు ఇతర స్వీట్లలోనూ ఉన్న పాక్ అనే పేరును తీసేస్తున్నారు. వాటి స్ధానాల్లో శ్రీ అనే పేరును చేరుస్తున్నారు. దీంతో స్వీట్లన్నీ ఇప్పుడు శ్రీ పేర్లతో దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి కన్నడ పేరు అయిన పాక్ లేదా పాకా కు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన శ్రీ పేరు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులకు సైతం స్ఫూర్తినిచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ మైసూర్ పాక్ పుట్టిన మైసూర్ లో కానీ, కర్నాటకలో కానీ ఈ మార్పు కనిపించడం లేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications