Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూ కాశ్మీర్ లో ఆరుగురు ప్రభుత్వోద్యోగుల తొలగింపు ; వారికి ఉగ్రవాద లింకులపై కమిటీ సిఫార్సుతో చర్య

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆరుగురు ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరుగురు ఉగ్రవాదులతో సంబంధాలను కలిగి ఉన్నారని, ఉగ్రవాదులకు ప్రభుత్వ వ్యవహారాల సమాచారాన్ని అందిస్తున్నారని గుర్తించిన జమ్ము కాశ్మీర్ సర్కార్ ఆరుగురు ఉద్యోగులను తొలగించింది. ప్రభుత్వం చర్య తీసుకున్న ఆరుగురు ఉద్యోగులలో, జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగంలో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు.

ఉగ్రవాద లింకులపై కమిటీ విచారణ, సిఫార్సు .. ప్రభుత్వోద్యోగుల తొలగింపు
నివేదికల ప్రకారం, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాద లింకులపై పరిశీలన జరపటానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ జరిపిన కమిటీ సిఫార్సు మేరకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం, ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాద లింకులపై దర్యాప్తు చేయడానికి ఒక ఏర్పాటు చేసిన కమిటీ కేసులను పరిశీలించింది. కేంద్రపాలిత ప్రాంతంలో నియమించబడిన కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సులు చేసిన తర్వాత ప్రభుత్వం ఈ చర్యలను ప్రారంభించింది.

Jammu and Kashmir govt sacked 6 employees over terrorist links, 2 police among them

జులైలోనూ 11 మందిని తొలగించిన జమ్మూ కాశ్మీర్ సర్కార్

గత వారం, కేంద్ర పాలిత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి విభాగాల నుండి విజిలెన్స్ క్లియరెన్స్ పొందకపోతే పాస్‌పోర్ట్ జారీ చేయబడదని చెప్పింది. అంతకు ముందు జూలైలో కూడా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఇవే ఆరోపణలతో 11 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు ఉన్నారు. ఇది కాకుండా, పోలీసు శాఖ నుండి ఇద్దరు వ్యక్తులను కూడా తొలగించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాద సంస్థలకు అండర్ గ్రౌండ్ వర్కర్స్ గా పని చేస్తున్నారని ఆరోపించారు.

ఆర్టికల్ 311 (2) (సి) నిబంధన ప్రకారం విచారణ లేకుండానే ఉద్యోగులను తొలగించే అధికారం
ఆర్టికల్ 311 (2) (సి) నిబంధన ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్, రాష్ట్ర భద్రతా ప్రయోజనాల దృష్ట్యా, ఉగ్రవాద లింకులు ఉన్నాయని అనుమానిస్తున్న వ్యక్తులపై విచారణ జరపడం మంచిది కాదని సంతృప్తి చెందితే, విచారణ లేకుండానే ఉద్యోగులను తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత పాత్ర, అతని ప్రవర్తన, పూర్వ చరిత్ర ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఉత్తర్వు వచ్చింది.

దేశ సమగ్రతను కాపాడటం కోసం పని చెయ్యాలన్న జమ్మూ కాశ్మీర్ సర్కార్
కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ యొక్క సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన సూచనల ప్రకారం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా యూనియన్ ఆఫ్ ఇండియా మరియు భారత రాజ్యాంగంపై సంపూర్ణ సమగ్రత, నిజాయితీ మరియు విధేయతను పాటించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి భారత దేశ సమగ్రతను కాపాడేలా పనిచేయాలని, అలా కాకుండా అనుచితంగా ప్రవర్తించకూడదు అని పేర్కొంది. ఒక వేళ అలా ఎవరైనా ప్రవర్తిస్తే నిర్దాక్షిణ్యంగా తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూకలు నిత్యం ఎక్కడో ఒక చోట అలజడి సృష్టించేందుకే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోవటానికి స్థానికుల, ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కూడా వారికి ఉందని గుర్తించారు. అండర్ గ్రౌండ్ వర్కర్స్ గా వీరు పని చేస్తున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వోద్యోగులపై అనుమానాలున్న నేపధ్యంలో కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సుల మేరకు జమ్మూ సర్కార్ వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+