అతను వేధించాడు, పద్మావత్‌లో ఖిల్జీలాంటివాడు: జయప్రద

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొహ్మద్ ఆజంఖాన్‌పై సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద మరోసారి ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య వివాదాలు పెద్ద యెత్తున చెలరేగిన విషయం తెలిసిందే.

రాంపూర్ నియోజకవర్గం నుంచి 2009లో రెండో సారి తాను పటీ చేసినప్పుడు ఆజంఖాన్ తనను వేధించాడని ఆమె ఆరోపించారు. ఆజంఖాన్ బాలీవుడ్ సినిమా పద్మావత్‌లో ప్రతినాయకుడైన ఖల్జీ లాంటివాడని ఆమె వ్యాఖ్యానించారు.

నా ప్రతిష్టను దెబ్బ తీయడానికి....

నా ప్రతిష్టను దెబ్బ తీయడానికి....

తన ప్రతిషన్టను దిగజార్చడానికి ఆజం ఖాన్ చౌకబారుగా వ్యవహరించారని జయప్రద 2009 మేలో ఆరోపించారు. అదే విషయానికి ఆమె ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. అదే విషయం శనివారం చెప్పారు.

నాకు అదే గుర్తుకు వచ్చింది

నాకు అదే గుర్తుకు వచ్చింది

తాను పద్మావత్ సినిమా చూస్తున్నప్పుడు ఖిల్జీ పాత్ర తనను ఆజంఖాన్‌జీని గుర్తుకు తెచ్చిందని జయప్రద అన్నారు. తాను పోటీ చేసినప్పుడు ఆజంఖాన్ తనను వేధించాడని ఆరోపించారు.

ఆయన ఇలా చేశారని...

ఆయన ఇలా చేశారని...

ఆజంఖాన్ మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన తన ఫొటోలతో సిడీలను పంపిణీ చేస్తున్నాడని జయప్రద ఆజంఖాన్‌పై అప్పట్లో ఆరోపించారు. తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. అయితే, ఆమె పార్టీ నుంచి తర్వాత బహిష్కరణకు గురయ్యారు

అప్పుడు కూడా వివాదం...

అప్పుడు కూడా వివాదం...

జయప్రదకు, ఆజంఖాన్‌కు మధ్ 2012లో కూడా వివాదం చెలరేగింది. ఆజంఖాన్‌కు తగిన బుద్ధి చెప్తానని ఆమె హెచ్చరించారు కూడా.13వ శతాబ్దానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. పద్మావత్ సినిమాలో ఆ పాత్రను రణ్‌వీర్ పోషించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jaya Prada in May of 2009 had accused Azam Khan of resorting to cheap tactics to bring her image down. She maintained her charges on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి