జయలలిత మళ్లీ పుట్టింది -తీవ్రవాదుల నుంచి కాపాడింది: బీజేపీ నేత విజయశాంతి భావోద్వేగం

సినీ రంగంలోనేకాక, భారత రాజకీయాల్లో చెరిగిపోని ముద్రవేసిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 73వ వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరిగాయి. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే అధికారికంగా జయంతిని నిర్వహించగా, అసలైన సదండి మాత్రం ఆమె నెచ్చెలి వీకే శశికళ ఇంటి వద్దే కనిపించింది. తెలుగు సినీ నటీ, తెలంగాణ బీజేపీ కీలక నేత విజయశాంతి సైతం తలైవిని తలుచుకూంటూ భావోద్వేగానికి గురయ్యారు...

 అమ్మ మళ్లీ పుట్టారు..

అమ్మ మళ్లీ పుట్టారు..

జయలలిత జయంతి సందర్భంగా ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నేత విజయశాంతి బుధవారం ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ''అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి.. అంతేకాదు..

తీవ్రవాదులు టార్గెట్ చేసినప్పుడు..

తీవ్రవాదులు టార్గెట్ చేసినప్పుడు..

మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు.. కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ మర్చిపోలేనిది. నన్ను ఉద్దేశించి.. 'పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు)' అని, 'ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి)' అని మీరు ఇచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి..'' అని విజయశాంతి పేర్కొన్నారు. మరోవైపు..

 అమ్మ అభిమానులంతా ఏకం కావాలి..

అమ్మ అభిమానులంతా ఏకం కావాలి..

జయలలిత జయంతి సందర్భంగా చెన్నైలో బుధవారం ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. జయలలితకు నివాళులు అర్పించేక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శశికళ నివాసానికి వచ్చేశారు. అన్నాడీఎంకేలో జయలలిత తర్వాతి స్థానం తనదే అనే సంకేతాలకు శశికళ కేడర్‌కు పంపారు. టి.నగర్‌లోని తన నివాసం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి.. ''తలైవి అమ్మకు నిజమైన కేడర్ అంతా ఏకం కావాలి. మీరంతా అన్నాడీఎంకే కోసం సమష్టిగా పనిచేయాలి'' అని శశికళ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+