వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేవ్ డెమోక్రసి,.. పార్లమెంట్‌ గాంధీ విగ్రవం వద్ద విపక్షాల ధర్నా...

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామ వెనుక బీజేపీ హస్తం ఉందంటూ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్షాలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహాం ముందు ఆందోళన చేపట్టారు. కర్ణాటకతోపాటు,గోవాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసి అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఆందోళనలో యూపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో పాటు, రాహుల్ గాంధీ, ఎంపీలు ఇతర పార్టీల నేతలు పాల్గోన్నారు.

కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామ చేయడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తింది. రాజీనామ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ముంబాయి హోటల్లో ఆశ్రయం కల్పించడంతో పార్టీ మార్పుకు పోత్సహిస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభ నేత ఆధీర్ రంజన్ ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు తిప్పికొట్టారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Join Protests After Karnataka, Goa Congress Meltdown at parliament

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో దాని మిత్రపక్షలు బహిరంగ ఆందోళనకు దిగాయి. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.కాగా ధర్నాలో కాంగ్రస్‌తోపాటు ఎన్సీపీ, టీఎంసీ,ఎస్పీ పార్టీల ఎంపీలు పాల్గోన్నారు.

English summary
Rahul Gandhi and his mother Sonia Gandhi today joined a Congress protest at parliament a day after the party lost most of its lawmakers to the ruling BJP in Goa and came closer than ever to losing power in Karnataka following several resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X