బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మద్దతు ప్రముఖ హీరో ప్రచారం, సీఎం మీద పోటీ, రెండు చోట్ల!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ,జేడీఎస్ తదితర పార్టీల ప్రచారం జోరందుకుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు సినిమా తారలతో ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బళ్లారి ఎంపీ, సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్న బి. శ్రీరాములు తరపున ప్రచారం చెయ్యడానికి స్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు సిద్దం అయ్యారు.

సీఎం మీద పోటీ

సీఎం మీద పోటీ

బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. అలాగే బాగల్ కోటే జిల్లా బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్న శ్రీరాములు చాల బిజీబిజీగా ఉన్నారు.

రంగంలోకి హీరో

రంగంలోకి హీరో

స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ హీరో మిస్టర్ పీస్, రాకింగ్ స్టార్ యశ్ మోళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు తరపున ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. మాళకాల్మూరులో శ్రీరాములును గెలిపించాలని స్థానిక ఓటర్లకు మనవి చెయ్యడానికి రాకింగ్ స్టార్ యశ్ రెడీ అయ్యారు. బాదామిలో కూడా శ్రీరాములు తరపున రాకింగ్ స్టార్ యశ్ ప్రచారం చేసే అవకాశం ఉంది.

బెంగళూరులో యశ్ ప్రచారం

బెంగళూరులో యశ్ ప్రచారం

శుక్రవారం హీరో యశ్ బెంగళూరులోని బోమ్మనహళ్ళి శాసన సభ నియోజక వర్గంలో స్థానిక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ప్రవాసాంధ్రులు అధికంగా ఉంటున్న బోమ్మనహళ్ళి నియోజక వర్గంలో రాకింగ్ స్టార్ యశ్ బీజేపీ తరపున జోరుగా ప్రచారం చేశారు.

ఒకే రోజు రెండు పార్టీలకు ప్రచారం

ఒకే రోజు రెండు పార్టీలకు ప్రచారం

రాకింగ్ స్టార్ యశ్ రెండు రోజుల క్రితం బుధవారం మైసూరులోని కృష్ణరాజ (కేఆర్) శాసన సభ నియోజక వర్గంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రామదాస్ తరపున, కేఆర్ నగర్ నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి సా.రా. మహేష్ తరపున ఒకే రోజు వేర్వేరుగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించి వారిద్దరి గెలిపించాలని మనవి చేశారు.

పార్టీలకు అతీతం

పార్టీలకు అతీతం

తాను ఏ పార్టీ సిద్దాంతాలను అనుసరించలేదని, తనకు అంత సమయం లేదని, రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిలేదని, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని, అయితే వ్యక్తిగతంగా తనకు పరిచయం ఉన్నవారు, మంచి వారిని గెలిపించాలని తాను పార్టీలకు అతీతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నానని రాకింగ్ స్టార్ యశ్ అంటున్నారు.

English summary
Karnataka Assembly Elections 2018 : Kannada actor Yash campaign BJP candidate of Molakalmuru constituency Sriramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X