కర్ణాటక ఎన్నికలు, టైమ్స్ నౌ సర్వే పోల్స్ ఫలితాలు, కాంగ్రెస్ దే కాలం, బీజేపీ, జేడీఎస్!
బెంగళూరు: కర్ణాక శాసన సభ ఎన్నికల్లో 222 స్థానాలకు మే 12వ తేదీన పోలింగ్ ప్రకియ పూర్తి అయ్యింది. ప్రశాంతంగా జరిగిన శాసన సభ ఎన్నికల పోల్స్ సర్వేలు ఒక్కొక్కటి విడుదల అవుతున్నాయి. ప్రముఖ టీవీ చానల్ టైమ్స్ నౌ కర్ణాటక శాసన సభ పోలింగ్ సర్వే ఫలితాలను శనివారం రాత్రి విడుదల చేసింది.
2,622 మంది అభ్యర్థులు పోటీ చేసిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 222 చోట్ల, కాంగ్రెస్ 220 చోట్ల, జేడీఎస్ 199 చోట్ల, బీఎస్పీ 18 చోట్ల, ఇతరులు 1,963 మంది పోటీ చేశారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల సర్వే ఫలితాలను టైమ్స్ నౌ విడుదల చేసింది.

2018 టైమ్స్ నౌ టీవీ చానల్-వీఎంఆర్ ఎక్సిట్ పోల్స్ ఫలితాలు
* కాంగ్రెస్ : 90-103
* బీజేపీ : 80 -93
* జేడీఎస్ : 31-39
* ఇతరులు: 2-4
2013లో టైమ్స్ నౌ టీవీ చానల్ పోలింగ్ సర్వే ఫలితాలు
*కాంగ్రెస్ : 132
*బీజేపీ : 38
* జేడీఎస్ : 38
* ఇతరులు: 16












Click it and Unblock the Notifications