మైనింగ్ కింగ్ గాలి బ్యాంక్ అకౌంట్స్ వివరాలతో మైండ్ బ్లాక్, బీపీ, సుగర్ గ్యాంరెటీ ?
బెంగళూరు/బళ్లారి: అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలోని రాజకీయ నాయకుల ఆస్తులు, వారి పూర్తి సమాచారం బయటకు వస్తోంది. మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు, ఆయన బ్యాంక్ అకౌంట్ ల సమాచారం తెలుసుకున్న కర్ణాటకలోని సామాన్య ప్రజలు ముక్కన వేలు వేసుకుంటున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి పేదవాడు అయిపోయారా ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పుతూ హెలికాప్టర్లలో తిరిగిన ఆ గాలి జనార్దన్ రెడ్డి, కేఆర్ పీ పార్టీ నుంచి గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఈ గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరేనా ? అంటూ చర్చించుకున్నారు. ఇద్దరూ ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.

గాలి జనార్దన్ రెడ్డి దగ్గర కేవలం రూ. 1, 33, 000 నగదు మాత్రమే ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలు ఇలా ఉన్నాయి.
* బళ్లారిలోని ఆక్సిస్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్.
* బళ్లారిలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఫ్రీజ్ అయ్యింది.
* గంగావతిలోని ఏడీ బీ బ్యాంక్, ఎస్ బీఐ బ్యాంకుల్లో కేవలం రూ. 10, 323 నగదు ఉంది.
* బళ్లారిలోని ఐఎన్ జీ వైశ్యా బ్యాంకుల్లో ఉన్న రెండు అకౌంట్ లలో ఎలాంటి లావాదేవీలు లేవు.
*. బెంగళూరులోని విధాన సౌధ ఎస్ బీఐ బ్యాంక్ లో ఎలాంటి లావాదేవీలు లేవు. గాలి జనార్దన్ రెడ్డి బ్యాంకు లావాదేవీలు గురించి స్వయంగా ఆయన ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు.
2. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ బ్యాంక్ అకౌంట్ వివరాలు.
* బళ్లారిలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో ఎలాంటి లావాదేవీలు లేవు.
* ఐఎన్ జీ వైశ్య బ్యాంక్ లో ఎలాంటి లావాదేవీలు లేవు.
* బళ్లారిలోని పీకేజీబీ బ్యాంక్ లో రూ. 760 నగదు ఉంది.
* కెనరా బ్యాంక్ లోని రెండు అకౌంట్స్ లో రూ. 67, 700, రూ, 1, 38, 359 నగదు ఉంది.
* బళ్లారిలోని ఐసీఐసీఐ బ్యాంక్ లో ఏమాత్రం నగదు లేదు.
* బళ్లారిలోని యూనియన్ బ్యాంక్ లో ఎన్నికల అకౌంట్ కోసం ప్రారంభించిన అకౌంట్ లో రూ. 5,000 నగదు ఉంది.

3. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కీర్తి రెడ్డి అకౌంట్ లావాదేవీలు
* బళ్లారిలోని ఆక్సిస్ బ్యాంక్ లో ఒక్క రూపాయి డబ్బులు లేవు.
* బళ్లారిలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.
* బళ్లారిలోని ఐసీఐసీఐ బ్యాంక్ లో రూ. 15, 79, 000 నగదు ఉంది.
* బళ్లారిలోని ఎస్ బీఐ బ్యాంక్ లో రూ. 1, 39, 000 నగదు ఉంది. ఇవి కాకుండా గాలి జనార్దన్ రెడ్డి, గాలి లక్ష్మీ అరుణ, గాలి కీర్తి రెడ్డికి వివిద కంపెనీల్లో షేర్లు ఉన్నాయి.
గాలి జనార్దన్ రెడ్డి పేరుతో మొత్తం ఆస్తులు రూ. 29, 20, 44, 317, గాలి లక్ష్మీ అరుణ పేరు మీద మొత్తం ఆస్తులు రూ. 96, 26, 01, 144, గాలి కీర్తి రెడ్డి పేరుతో రూ, 7, 41, 97, 650 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ వివరాలను గాలి జనార్దన్ రెడ్డి, గాలి లక్ష్మీ అరుణ వేర్వేరుగా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లలో వివరాలు వెళ్లడించారు.












Click it and Unblock the Notifications