CM post: వాళ్ల ఫ్యామిలీకి సీఎం పోస్టు కాంట్రాక్ట్ ఇచ్చారా ?, గాలి జనార్దన్ రెడ్డి పార్టీతో ?, మంత్రి శ్రీరాముల
మాజీ సీఎం ఫ్యామిలీ ఏమైనా సీఎం పదవిని కాంట్రాక్టు తీసుకుందా ?, వాళ్లు తప్పా మరోకరు సీఎం కాకూడదా అంటూ మంత్రి శ్రీరాములు ప్రశ్నించారు. ప్రాణ స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి గురించి బళ్లారి శ్రీరాములు ఆసక్తికరంగా మాట్లాడారు
బెంగళూరు/బళ్లారి: భారతదేశంలో ఎవ్వరైనా రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాలు చెయ్యవచ్చు, సీఎంలు కావచ్చు అని కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. ఈ కులం నాయకుడు సీఎం కావాలని, ఇంకో కులం నాయకుడు సీఎం కాకూడదని ఎక్కడా రూల్ లేదని బళ్లారి శ్రీరాములు చెప్పారు. ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే పద్దతిగా ఉంటుందని, కులం పేరుతో వ్యగంగా మాట్లాడంలో అర్థం ఉండదని మాజీ సీఎంకు బళ్లారి శ్రీరాములు జలక్ ఇచ్చారు. మాజీ సీఎం ఫ్యామిలీ ఏమైనా సీఎం పదవిని కాంట్రాక్టు తీసుకున్నారా ?, వాళ్లు తప్పా మరోకరు సీఎం కాకూడదా అంటూ బళ్లారి శ్రీరాములు ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రాణ స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి గురించి, ఆయన కొత్త రాజకీయ పార్టీ గురించి మంత్రి బళ్లారి శ్రీరాములు ఆసక్తికరంగా మాట్లాడారు.

మాజీ సీఎం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదు
బ్రాహ్మణులు కూడా సీఎంలు కాగలరు, సీఎంలు కాకపోతే ఎలా? కులాల మధ్య కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి విషబీజాలు నాటుతున్నారని కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు మండిపడ్డారు. ఎకులం వాళ్లు సీఎం కావాలో అని డిసైడ్ చెయ్యడానికి మాజీ సీఎం కుమారస్వామి ఎవరు, సీఎం ఎవరు కావాలి అని ప్రజలు డిసైడ్ చేస్తారని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

సీఎం పదవికి కులంతో పనిలేదు
కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిపై విరుచుకుపడ్డారు. హుబ్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీరాములు ప్రజాస్వామ్యంలో తాను మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కొందరు అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. రాజ్యాంగంలో ఏ కులానికి చెందిన నాయకుడు అయినా సీఎం కావొచ్చు. ఆ నాయకులు షెడ్యూల్డ్ కులాలు చెందిన వారు కావచ్చు, బ్రాహ్మణులు కూడా కావచ్చు. ఎవరైనా సీఎం కావచ్చని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

వాళ్ల ఫ్యామిలీకి సీఎం పదవి కాంట్రాక్టు ఇచ్చారా ?
ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే పద్దతిగా ఉంటుందని, కులం పేరుతో వ్యగంగా మాట్లాడంలో అర్థం ఉండదని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామికి మంత్రి బళ్లారి శ్రీరాములు జలక్ ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఫ్యామిలీ ఏమైనా సీఎం పదవిని కాంట్రాక్టు తీసుకున్నారా ?, వాళ్లు తప్పా కర్ణాటకలో మరోకరు సీఎం కాకూడదా అని మంత్రి బళ్లారి శ్రీరాములు మాజీ సీఎం కుమారస్వామిని బహిరంగంగా నిలదీశారు.

మాజీ సీఎం పద్దతి మార్చుకోవాలి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విషయంలో మాజీ సీఎం కుమారస్వామి అలా మాట్లాడుతారని ఎవ్వరూ ఊహించలేదని, ఆయన అలా మాట్లాడటం మానేయాలని మంత్రి శ్రీరాములు సూచించారు. ప్రహ్లాద్ జోషి పెద్ద నాయకుడు, ఆయన స్థాయి వేరు. ఆయన గురించి ఏకవచనంతో కుమారస్వామి మాట్లాడటం చూసి ప్రజలు షాక్ అయ్యారని, కుమారస్వామి ఆయన మాట్లాడే పద్దతి మార్చుకోవలని మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. ప్రహ్లాద్ జోషి సీఎం కాకూడదని ఏమైనా రూల్ ఉంది, ఆయన చాలా గొప్పనాయకుడు అని, అలాంటి వ్యక్తి సీఎం అయితే తప్పు ఏముందని మంత్రి శ్రీరాములు అన్నారు.

యడియూరప్ప విషయంలో ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప విషయంలో కుమారస్వామి మాట్లాడిన తీరును మంత్రి శ్రీరాములు తప్పుబట్టారు. ప్రస్తుతం యడియూరప్ప ఉన్న పరిస్థిని అడ్డం పెట్టుకుని మాజీ సీఎం కుమారస్వామి ఇలాంటి రాజకీయాలు చెయ్యడం సరికాదని కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

నేను బళ్లారిలో పోటీ చేస్తా
ఇదే సమయంలో మంత్రి బళ్లారి శ్రీరాములు ఆయన ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారని, ఆయన అభిమానులు పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే తాను బళ్లారి నుంచి పోటీ చేస్తానని మంత్రి శ్రీరాములు బాంబు పేల్చారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీలోకి వెళ్లనని పరోక్షంగా మంత్రి శ్రీరాములు పరోక్షంగా చెప్పారు.












Click it and Unblock the Notifications