బళ్లారిలో బాంబు పేల్చిన మాజీ డీసీఎం, ఫోన్ చేసి రాజీనామా చెయ్యమన్నారు. అంతే !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మరోసారి అవకాశం రాని బీజేపీ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో మరి కొంత మంది లోలోపల రగిలిపోతున్నారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప బళ్లారిలో బాంబు పేల్చారు.
బీజేపీ హైకమాండ్ మాకు ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేదు ?, అసలు ఏం జరిగింది ? అని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు. కేఎస్. ఈశ్వరప్ప బళ్లారిలోని ఆయన ఇంటి దేవుడు అయిన శ్రీచాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారి వెళ్లారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఫోన్లు చేసి మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తప్పుకోవాలని, మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పారని కేఎస్. ఈశ్వరప్ప మీడియాకు చెప్పారు. బీజేపీ సీనియర్ నేత బీఎల్, సంతోష్ కూడా తనతో మాట్లాడి ఇదే విషయం చెప్పారని కేఎస్. ఈశ్వరప్ప అన్నారు.
బీజేపీ హైకమాండ్ సూచన మేరకే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ గురించి తనకు తెలీదని కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. తనకు బీజేపీ ఇంతకాలం ఉన్నత పదువులు. పార్టీలో ఉన్నత స్థానం కల్పించిందని, బీజేపీ మీద తనకు ఎలాంటి కోపం లేదని, తాను అన్ని పదవులు అనుభవించానని కేఎస్. ఈశ్వరప్ప వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యనంత మాత్రానా తనకు ఎలాంటి నస్టం లేదని. చిన్న పదవి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి వరకు తాను బీజేపీలో అనుభవించానని, ఇక ముందు కూడా తాను బీజేపీ కోసం పని చేస్తానని కేఎస్. ఈశ్వరప్ప వివరించారు. తన కుమారుడు కాంతేష్ శివమొగ్గలో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తే తనకు అంతే చాలు అని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప తన మనసులోని మాట బయటపెట్టారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications