అదే కనుక జరిగితే.. మోడీని, యోగిని చంపేస్తా.. చేతిలో ఆయుధంతో వ్యక్తి వీడియో!!
ప్రస్తుతం దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల మేనియా కొనసాగుతుంది. రానున్న లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నాయి. కేంద్రంలో మరోమారు అధికారం చేపట్టాలని మోదీ, ఈసారైనా పాలనా పగ్గాలు చేపట్టాలని రాహుల్ గాంధీ సభలు, సమావేశాలతో ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సమయంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానంటూ ఒక వ్యక్తి వీడియో షేర్ చేయడం అందరిని షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రానున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నరేంద్ర మోడీతో పాటు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను తాను చంపేస్తానంటూ కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని జిల్లాలోని రంగంపేట కు చెందిన మహమ్మద్ రసూల్ కడారి గా గుర్తించిన పోలీసులు అతను హైదరాబాద్లో దినసరి కూలీగా పని చేస్తున్నట్టు గుర్తించారు.
నిందితుడు రిలీజ్ చేసిన వీడియోలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీని, ఆంధ్రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానని, చేతిలో పదునైన ఆయుధంతో తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. యోగి ఆదిత్యనాథ్ ను, భారత ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా దుర్భాషలాడుతూ ఫేస్ బుక్ లో ఆ వీడియోను రిలీజ్ చేశాడు.
అయితే అది సెల్ఫీ వీడియో అని, నిందితుడు ఆ వీడియోలో మోడీ, ఆదిత్యనాథ్ దుర్భాషలాడటంతో పాటు, చంపేస్తానని హెచ్చరికలు జారీ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని చేతిలో పదునైన ఆయుధాన్ని చూపిస్తూ బెదిరించటాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications