మోడీ షాక్: కాంగ్రెస్ మంత్రికి ఐటీ సమన్లు, విచారణకు హాజరైన డీకే బ్రదర్స్ అండ్ కో !

ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు.

బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోమవారం విచారణకు హాజరైనారు. మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు (కాంగ్రెస్) డీకే. సురేష్ విచారణకు హాజరైనారు.

బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయం నాలుగో అంతస్తులో మంత్రి డీకే. శివకుమార్, డీకే. సురేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎస్. రవి, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ తదితరులను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారరణ చేస్తున్నారు.

Karnataka Minister DK Shivakumar on Monday appeared for IT enquiry

మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన అధికారులు ముందుగానే ప్రశ్నలు సిద్దం చేసుకుని తరువాత మంత్రి డీకే. శివకుమార్ తో సహ మిగిలిన వారికి సమన్లు జారీ చేసి విచారణ మొదలు పెట్టారు.

మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ విచారణలో ఏం చెబుతారో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రి దగ్గర వివరణ తీసుకున్న తరువాత అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+