అత్తకూతుర్ని కిడ్నాప్ చేశాడు, అంతలోనే ఎంతపని జరిగింది ?, రాముడు ఎవ్వరిమాట వినడు !
పెళ్లికి అంగీకరించలేదని ఓ స్కూల్ టీచర్‌ని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ కు గురైన లేడీ టీచర్‌ను రక్షించిన పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. స్కూల్ ముందే లేడీ టీచర్ ను కారులో కిడ్నాప్ చెయ్యడం కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన చాలా గంటల తరువాత లేడీ టీచర్ ను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ శివారులో చోటుచేసుకుంది. అర్పితా అనే ఉపాధ్యాయురాలిని రక్షించిన తర్వాత ఆమెను తల్లిదండ్రులతో కలిసి ఇంటికి పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. తన సహచరులతో కలిసి ఇన్నోవా కారులో వచ్చిన రాము అనే వ్యక్తి స్కూల్‌కు వెళ్తున్న టీచర్ అర్పితాపై మెరుపుదాడి చేశాడు. ఘటన అనంతరం పోలీసులు వెంటనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

నిందితుడు రాము లేడీ టీచర్ అర్పితాను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న లేడీ టీచర్ అర్పితాను పోలీసులు సురక్షితంగా రక్షించారు. అర్థరాత్రి ఉపాధ్యాయురాలు అర్పితాను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించామని హాసన్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు వెంబడించగా మిగిలిన నిందితులు తప్పించుకోగా రాము ఒక్కడే కారులో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. దక్షిణ కన్నడలోని నెల్యాడి సమీపంలో కిడ్నాపర్ రామును పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఉదయం 8. 50 గంటలకు ఉపాధ్యాయురాలు అర్పితా ఆమె ఉద్యోగం చేస్తున్న స్కూల్ ముందే కిడ్నాప్ అయ్యింది. సాయంత్రం సమయంలో నిందితులను పోలీసులు వెండించారు.
తరువాత రాముతో పాటు లేడీ టీచర్ అర్పితాను అర్దరాత్రి హాసన్ కు పిలుచుకుని వచ్చారు. రాము అతని అత్త కూతురు అర్పితాను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. రాము అతని తల్లిదండ్రుల ద్వారా పెళ్లి ప్రపోజ్ చేశాడు. అయితే అర్పితాతో పాటు ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో రాము రగిలిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కారులో అర్పితాను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు నిందితుడు రాము అతని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు.
అయితే అర్పితా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో రాము వెంటనే గుడిలో పెళ్లి చేసుకోవడానికి వెనుకాడాడు. పోలీసులు వెంబడించడంతో రాములు పోలీసుల వలలో చిక్కుకున్నాడు. నిందితుడు రామును అరెస్టు చేసి అర్పితాను క్షేమంగా రక్షించడానికి హసన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడంతో ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు, అపహరణ కేసుకు సంబంధించి రాము మీద పోలీసులు హసన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications