Keerthy Suresh: అతనితో కీర్తి సురేష్ పెళ్లి..?ఫోటోస్ వైరల్..!

Keerthy Suresh:పలు వరుస హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందా..? త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది ఎవరిని..? అతను ఏం చేస్తాడు.. ఎక్కడుంటాడు..?

దసరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మళయాలీ కుట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తి ఫోటో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫిలింనగర్‌లో కీర్తి పెళ్లిపై రకరకాలుగా వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. కీర్తి సురేష్ ఫర్హాన్ బిన్ లియాకత్ ఫోటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ చెప్పింది. మహానటి షేర్ చేసిన ఈ ఫోటో పలు గాసిప్స్‌కు కారణమైంది.

 keerthi

కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి ఫర్హాన్ బిన్ లియాకత్ దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. దుబాయ్‌లో మంచి గుర్తింపున్న రియల్టర్ ఫర్హాన్. అతనితో కలిసి ఉన్న ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ ఎల్లో కలర్ జాకెట్స్ ధరించి ఉన్నారు. షేర్ చేసిన కొద్ది సమయంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫర్హాన్ కీర్తి సురేష్ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చని కొందరు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు.

అయితే ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఆ విషయం ఫోటోలోని వారి హావభావాలను చూస్తే అర్థమవుతుందని కొందరు కామెంట్స్ చేశారు.ఇక ఫర్హాన్ విషయానికొస్తే దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడే సెటిల్ అయిన మళయాలీ.ఇతనికి కేరళకు చెందిన చాలామంది సెలబ్రిటీలతో పరిచయం ఉంది. కీర్తి సురేష్ కూడా కేరళకు చెందిన స్టార్ కనుక ఆమెతో కూడా అలా పరిచయం ఏర్పడి ఉెంటుందనే వాదన కూడా ఉంది.

ఇక కీర్తి సురేష్ ప్రొఫెషనల్ కెరీర్‌కు వస్తే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. దసరా హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్‌లో ఆయనకు సోదరిగా నటిస్తోంది.ఇదేకాక పలు ఇతర భాషా చిత్రాలకు కూడా కీర్తి సురేష్ సైన్ చేసింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎంత వరకు నిజమనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+