ఆరెస్సెస్ ఈవెంట్లకు వెళ్లాక నాకేం న్యాయం చేస్తారు? జడ్జికి కేజ్రివాల్ షాక్..!
ఢిల్లీ మద్యం కేసును కొట్టేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన కేజ్రివాల్ (Arvind Kejriwal).. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ జరిపేందుకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ గతంలో బీజేపీ, ఆరెస్సెస్ ఈవెంట్లకు హాజరయ్యారని, ఆయన ఈ కేసులో తనకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదని, కాబట్టి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కేజ్రివాల్ సంచలన డిమాండ్ చేశారు.
జడ్జి స్వర్ణకాంత శర్మను ఉద్దేశించి కేజ్రివాల్.. "మీరు అధివక్త పరిషత్ యొక్క కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కేసు ఒక రాజకీయ కేసు. నిజానికి, సుప్రీంకోర్టు తన పరిశీలనలో 'క్రియాశీల ప్రజాస్వామ్యంలో అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. సీబీఐని పంజరంలో బంధించిన చిలుక అని చెప్పింది. సీబీఐ ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవడం ెముఖ్యం." అని తెలిపారు. మద్యం విధానం కేసులో తనను, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ శర్మను తప్పించాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మీరు ఒక నిర్దిష్ట భావజాలానికి చెందిన కార్యక్రమానికి వెళ్లినప్పుడు, నేను దానికి వ్యతిరేక భావజాలానికి చెందినవాడినైతే నాకు న్యాయం జరుగుతుందా?" అనే అభిప్రాయం నా మనసులో ఏర్పడిందని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. అధివక్త పరిషత్ ప్రచారం చేస్తున్న భావజాలాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అనే ఆందోళన తనకు కలిగిస్తోందని, సీబీఐ, ఈడీ కోరిన దాన్నే ఈ కోర్టు ఆమోదిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రివాల్ వాదన నేపథ్యంలో జడ్డీ ఈ కేసు విచారణ చేయాలా వద్దా అనేది కోర్టు తేల్చనుంది.












Click it and Unblock the Notifications